కరోనా కష్టకాలంలో రెడ్ క్రాస్ సేవలను మరింత వేగవంతం చేయాలన్న బిశ్వభూషణ్
- జిల్లా పాలనాధికారులతో రాజ్ భవన్ నుండి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించిన గవర్నర్
- ఐదు అంశాలపై సమాలోచన, భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పన
- యూనిసెఫ్, రెడ్ క్రాస్ భాగస్వామ్య కార్యక్రమాలపై సమీక్ష
ఉచిత వైద్య శిభిరాల నిర్వహణ మొదలు, మాస్క్ ల పంపిణీ, ప్రజలలో అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలపై గవర్నర్ దృష్టి సారించారు. వలస కార్మికుల విషయంలో రెడ్ క్రాస్ చేపట్టిన కార్యక్రమాల తీరు తెన్నులపై బిశ్వ భూషణ్ జిల్లా స్దాయిలో రెడ్ క్రాస్ బాధ్యులతో మాట్లాడారు. వారి కోసం చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపై నిశితంగా పరిశీలించారు. ప్రత్యేకించి రక్త నిల్వల పరంగా రెడ్ క్రాస్ సొసైటీ మంచి సేవలు అందిస్తుండగా, కరోనా నేపధ్యంలో రక్తదాన శిబిరాల నిర్వహణ ఏ తీరుగా జరుగుతోంది, ప్రస్తుతం వివిధ రక్త నిధులలో ఉన్న నిల్వల పరిస్ధితి ఏమిటి అన్న దానిపై కూడా గవర్నర్ జిల్లా కలెక్టర్ల నుండి వివరాలు తీసుకుని, బౌతిక దూరం పాటిస్తూ రక్త దాన శిబిరాల నిర్వహించటంపై జిల్లా పాలనాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జూన్ నెల చివరి వరకు ఆంక్షలతో లాక్ డౌన్ కొనసాగ నుండగా, ప్రత్యేకించి ఈ సమయంలోనే రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందన్న విషయాన్ని వారికి వివరించాలన్న గవర్నర్ ఈ క్రమంలో రెడ్ క్రాస్ ఏతరహా కార్యక్రమాలకు ప్రాధన్యత ఇవ్వాలన్న దానిపై రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎకె ఫరీడాలతో చర్చించారు. మరోవైపు అంతర్జాతీయ బాలల సంస్ధ యూనిసెఫ్ తో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ ఇటీవల ప్రత్యేక అవగాహనా ఒప్పందం కుదుర్చుకోగా. దీనిని అనుసరించి రెడ్ క్రాస్ స్యచ్ఛంధ కార్యకర్తలకు సామర్ధ్య పెంపుపై అందిస్తున్న తీరుతెన్నుల గురించి గవర్నర్ అరా తీసారు. రాజ్ భవన్ నుండి సమావేశంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎ.శ్రీధర్ రెడ్డి, ఎకె ఫరీడా తదితరులు పాల్గొనగా, అయా జిల్లాల నుండి కలెక్టర్లు, రెడ్ క్రాస్ జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.