తెలంగాణ సీఎం స‌హాయ నిధికి రూ.2ల‌క్ష‌ల విరాళం అందించిన చందుప‌ట్ల పీఏసీఎస్ చైర్మ‌న్

  • మంత్రి ఎర్ర‌బెల్లికి అంద‌చేసిన చందుప‌ట్ల పీఏసీఎస్ చైర్మ‌న్ మంద‌డి ల‌క్ష్మీనర్సింహారెడ్డి
  • క‌రోనా క‌ట్ట‌డికి స్వీయ‌ నియంత్ర‌ణ‌కు మించిన వైద్యం లేదు: ఎర్ర‌బెల్లి
హైద‌రాబాద్, మే 30: క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌కు పాటు ప‌డుతున్న సీఎం కేసీఆర్ కి అండ‌దండ‌గా అనేక మంది ముందుకు వ‌స్తున్నారు. సీఎం స‌హాయ నిధికి త‌మ వంతుగా సాయం అందిస్తున్నారు. తాజాగా యాదాద్రి జిల్లా భువ‌న‌గిరి మండ‌లం చందుప‌ట్ల ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కార సంఘం చైర్మ‌న్ మంద‌డి ల‌క్ష్మీన‌ర్సింహారెడ్డి రూ.2ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆ చెక్కుని హైద‌రాబాద్ లో శ‌నివారం రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాకర్ రావు కి అంద‌చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌లో మిగ‌తా రాష్ట్రాలు, దేశాల‌కంటే కూడా సీఎం కేసీఆర్ సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాల‌తో తెలంగాణ‌లో స‌మ‌ర్ధంగా అడ్డుకున్నార‌న్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వ‌ల‌స కూలీల కార‌ణంగా కొంత విస్తృతి జ‌రుగుతుంద‌న్నారు. అయినా భ‌య‌ప‌డాల్సింది లేద‌ని, ప్ర‌జ‌లు స్వీయ నియంత్ర‌ణ‌తో, సామాజిక భౌతిక దూరం పాటిస్తూ క‌రోనాని ఎదుర్కోవాల‌న్నారు. జాగ్ర‌త్త‌కు మించిన వైద్యం లేద‌న్నారు. మంద‌డి ల‌క్ష్మీన‌ర్సింహారెడ్డిని అభినందించారు. కాగా, క‌రోనా నిర్మూల‌న‌కు ఈ నిధిని వాడాల‌ని సూచిస్తున్న‌ట్లు, సీఎం గారి, మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుగారి ఔదార్యం స్ఫూర్తిగా తాము ఈ నిధిని అంద‌చేస్తున్న‌ట్లు మంద‌డి ల‌క్ష్మీన‌ర్సింహారెడ్డి తెలిపారు.

More Press News