పదవ తరగతి విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపండి: తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్

లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డ పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తేదీలను ప్రకటించినందున రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు సూచించారు. స్థానిక సాంఘిక విద్యాసంస్థల కార్యాలయ సమావేశ మందిరంలో ఆశ్రమ పాఠశాలలలో ఉన్న విద్యార్థుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సాంఘిక సంక్షేమ, మైనారిటీ సంక్షేమ విద్యాసంస్థల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన పదోతరగతి పరీక్షలు వచ్చే నెల 8వ తేదీన ప్రారంభం అవుతున్నందున విద్యార్థులందరూ సంబంధిత ఆశ్రమ పాఠశాలలో ఈనెల 1న చేరుకుంటారని వారి ఆరోగ్య పరిరక్షణ గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. లాక్ డౌన్ సమయంలో నిర్వహించిన ఆన్ లైన్ క్లాసుల వాళ్ళ విద్యార్థులకు చాలా లబ్దిచేకురిందని విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారన్నారు.

మంత్రి కామెంట్స్ :
  • కరోనా మహమ్మారి వల్ల అందరూ ఆందోళనలో ఉన్నందున సంబంధిత ప్రిన్సిపాల్, స్టాఫ్ నర్సులు, విద్యార్థులు కోవిడ్-19 మరియు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, పరిశుభ్రత సామాజిక దూరం మొదలైన వాటి మీద అప్రమత్తంగా ఉండేలా అందరికీ అవగాహన కల్పించాలి.
  • ప్రతి పాఠశాల ప్రాంగణంలో ధర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి విద్యార్థులకు శానిటైజర్లు, మాస్క్ లు  అందించాలి. 
  • విద్యార్థుల మద్య తరగతి గదులలో వసతిగృహాలలో డైనింగ్ హాలులో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూసుకోవాలి. 
  • తరగతి గదులను, విద్యార్థులు కూర్చునే బెంచీ లను, బల్లాలను  ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. 
  • విద్యార్థులకు ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించే ఎలా చూడాలి. 
  • ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి మానసిక ఆందోళనకు గురికాకుండా చదువుపైనే ధ్యాసపెట్టేలా చూసుకోవాలి. 
సాంఘిక సంక్షేమ గురుకుల  విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తమ(173) పాఠశాలల్లో మొత్తం 12163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వారిలో 4155 మంది బాలురు, 7988 మంది బాలికలు ఉన్నారు అని తెలిపారు. మంత్రి సూచించిన సూచనలు తప్పకుండా పాటిస్తామని తెలిపారు.

మైనారిటీ గురుకుల పాఠశాలల కార్యదర్శి షఫీఉల్లా మాట్లాడుతూ తమ (83) పాఠశాలల్లో 4,600 మంది విద్యార్థులు పరీక్షలు హాజరవుతున్నారని తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో మైనారిటీ అభివృద్ధి శాఖ కార్యదర్శి అహ్మద్ నదీం ఆయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

More Press News