హైదరాబాద్‌లో కార్యకలాపాలను పునరుద్ధరించిన "ఇన్‌డ్రైవర్"
- క్యాబ్ లోపలకు ప్రవేశించే ముందు మాస్కు ధరించడం వినియోగదారులకు తప్పనిసరి
"దాదాపు రెండునెలల పాటు సేవలను నిలిపివేయడం వల్ల తామిప్పుడు తమ సేవలను తిరిగి ప్రారంభిస్తుండటం పట్ల పూర్తి ఉద్విగ్నంగా ఉన్నాము. అయితే , కోవిడ్-19 ప్రమాదం ఇంకా పొంచి ఉండటం చేత తమ డ్రైవర్లు, ప్రయాణీకుల భద్రత పట్ల కంపెనీ ఆందోళనగా ఉంది. ఈ కారణం చేతనే తమ డ్రైవర్ భాగస్వాములతో పాటుగా ప్రయాణీకులు సైతం అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి చేశాము'' అని పవిత్ నంద, పీఆర్ అండ్ కమ్యూనికేషన్స్ మేనేజర్, ఇండియా అన్నారు.
ఇన్‌డ్రైవర్‌పై తమ ప్రయాణాలను బుక్ చేసుకునే వినియోగదారులు తమ సవారీ ఆరంభానికి ముందు, తరువాత ఖచ్చితంగా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడంతో పాటుగా మాస్కు ధరించి మాత్రమే క్యాబ్ ఎక్కవలసి ఉంటుంది. అలాగే ప్రయాణీకులు తమ లగేజీని తామే కారులో పెట్టుకోవాలి. కారు వెనుక సీట్లో మాత్రమే ప్రయాణీకులు కూర్చునేందుకు అనుమతిస్తారు. అలాగే ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా ఓ క్యాబ్‌లో డ్రైవర్‌తో సహా ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
తమ సవారీ బుక్ చేసుకోవడానికి ప్రయాణీకులు యాప్‌పై తాము ఉన్న ప్రదేశం, చేరాల్సిన గమ్యం చెబ్తూ, తాము చెల్లించాలనుకునే మొత్తం, తమ డ్రైవర్‌ను ఎంచుకోవడమే ! భారతదేశంలో తాము ఎంచుకున్న మార్గానికి సూచనీయమైన ఫేర్‌ను ప్రయాణీకులు చెల్లించేందుకు అనుమతిస్తున్న ఒకే ఒక్క రైడ్ హెయిలింగ్ యాప్ ఇన్‌డ్రైవర్. డ్రైవర్ రేటింగ్ లేదా తాము చెల్లించాలనుకున్న మొత్తం, తమ గమ్యస్థానం చేరడానికి పట్టే సమయం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రయాణీకులు తమ రైడ్స్‌ను ఎంచుకునే అవకాశం ఈ యాప్‌లో ఉంది.