రైతుని రాజుని చేయాల‌నే ల‌క్ష్యంతో సీఎం కేసీఆర్ ప‌ని చేస్తున్నారు: మంత్రి ఎర్రబెల్లి

మ‌హ‌బూబాబాద్: నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేయాల్సిన అవ‌స‌రం - రైతులు త‌మ పంట‌ల ద్వారా అధిక దిగుబ‌డులు పొంది లాభ‌ప‌డాల్సిన ఆవ‌శ్య‌క‌త‌పై మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించిన‌ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్, రైతు స‌మన్వ‌య స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి.

మ‌హ‌బూబాబాద్ జిల్లా పంట‌ల ప్రణాళిక ను విడుద‌ల చేసి - రైతులు వేయాల్సిన పంట‌లు-వాటి మార్కెటింగ్, డిమాండ్ల ను ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, రైతు స‌మ‌న్వ‌య స‌మితి బాధ్యుల‌కు వివ‌రించిన‌ మంత్రి ఎర్ర‌బెల్లి, మంత్రి స‌త్య‌వ‌తి. ఈ సమీక్ష స‌మావేశంలో జెడ్పీ చైర్మ‌న్, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి చైర్మ‌న్, స‌భ్యులు, జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లాలోని వ్య‌వ‌సాయశాఖ స‌హా, ప‌లు శాఖ‌లకు చెందిన‌ అధికారులు పాల్గొన్నారు.

*మంత్రి ఎర్ర‌బెల్లి కామెంట్స్*
  • తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజునిచేయాల‌నే ల‌క్ష్యంతో సిఎం కెసిఆర్ ప‌ని చేస్తున్నారు
  • రైతుల‌కు సాగునీరు, ఉచిత విద్యుత్, పంట‌ల పెట్టుబ‌డులు, రుణ మాఫీలు, నాణ్య‌మైన విత్త‌నాలు, ఎరువులు అందుబాటులోకి తెచ్చిన సీఎం కెసిఆర్
  • లాభసాటి పంట‌ల‌తో, అంత‌ర్జాతీయ మార్కెట్ లో కూడా డిమాండ్ ఉన్న దిగుబడుల‌తో రైతు లాభం పొందాల‌నే సీఎం కెసిఆర్ ప్రాధాన్య పంట‌ల‌ను వేయాల‌ని చెబుతున్నారు
  • స‌న్న ర‌కాల వ‌రి, ప‌త్తి, కంది పంట‌ల‌కు బాగా డిమాండ్ ఉన్న‌ది
  • రాష్ట్రంలో కోటి 23 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి, ప‌త్తి, కంది వంటి పంట‌ల సాగు ఈ వానాకాలం జ‌ర‌గాల‌ని సిఎం ల‌క్ష్యంగా నిర్ణ‌యించారు
  • గ‌తంకంటే వ‌రి ప‌దిన్న‌ర ల‌క్ష‌ల ఎక‌రాలు, ప‌త్తి 65ల‌క్ష‌ల ఎక‌రాలు పెరిగేఅవ‌కాశం ఉంది. 76.83శాతం కంది పంట పెరుగుతుంద‌ని అంచ‌నా
  • అంతా ఒకే ర‌క‌మైన పంట‌లు వేయ‌డం వ‌ల్ల డిమాండ్ త‌గ్గి రేటు రావ‌డం లేదు
  • మ‌న నేల‌లు, భూ సారాన్ని బ‌ట్టి, మార్కెట్ లో డిమాండ్ ని బ‌ట్టి వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు చెప్పిన విధంగానే పంట‌లు వేయాల‌ని సిఎం కెసిఆర్ రైతాంగానికి చెబుతున్నారు
  • తెలంగాణ సోనా వంటి స‌న్న బియ్యం ర‌కాలు, లాంగ్ స్టేపుల్ కాట‌న్ ని మాత్ర‌మే వేయాలి

*మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ కామెంట్స్*
  • రైతుల ప‌క్ష‌పాతి సిఎం కెసిఆర్. అందుకే రైతుల‌కు అనేక స‌దుపాయాలు క‌ల్పించిన కెసిఆర్, ఏయే పంట‌లు వేయాలో కూడా నిర్దేశిస్తున్నారు
  • ఇదంతా కేవ‌లం రైతులు బాగు ప‌డాల‌నే సంక‌ల్ప‌మే త‌ప్ప మ‌రేమీ లేదు
  • వానా కాలం మ‌క్క‌ల దిగుబ‌డి త‌క్కువ ఉండ‌ట‌మే గాక‌, బూజు ప‌ట్టే అవ‌కాశం ఉంది
  • పైగా మ‌క్క‌ల నిలువ‌లున్నాయి. వ‌చ్చే పంట‌ల నాటికి మ‌క్క‌ల‌కు డిమాండ్ ఉండ‌ద‌ని ముందే గుర్తించారు
  • ఈ వానాకాలం నుంచి వ‌రిని 60శాతం స‌న్న ర‌కాలు, 40శాతం దొడ్డు ర‌కాలు వేస్తే బాగుంటుంది
  • మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని 16 మండ‌లాలు, 288 గ్రామాల్లో 461 గ్రామ పంచాయ‌తీల్లో ఏయే పంట‌లు వేయాలో వ్య‌వ‌సాయ అధికారులు ఇప్ప‌టికే నివేదిక‌లుసిద్ధం చేశారు
  • ఎఇఓ లు రైతుల‌ను క‌లిసి వారు వేయాల్సిన పంట‌ల‌ను ముందే చెబుతారు
  • జిల్లాలో 2.66ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు విస్తీర్ణం ఉంది. ఈ వానా కాలం 3.27 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు జ‌రుగుతుంద‌ని అంచ‌నా
  • ఎస్సారెస్పీ, మైన‌ర్ ఇరిగేష‌న్ల ద్వారా సాగు జ‌రుగుతున్న‌ది

*రైతు స‌మ‌న్వ‌య స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి కామెంట్స్*
  • తెలంగాణ రాష్ట్రంలో గ‌తంలో కంటే సాగు విస్తీర్ణం బాగా పెరిగింది
  • ప‌త్తి గ‌త ఏడాది 52.56 ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు చేస్తే, ఈ సారి 65ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు అవ‌నుంది
  • వ‌రి గ‌త ఏడాది 40.30ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు చేయ‌గా, ఈ ఏడాది 41.76ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు కానుంది
  • కంది గ‌త ఏడాది 7.29ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు అవ‌గా, ఈ ఏడాది 12.51ల‌క్ష‌ల ఎక‌రాల్లో సాగు కాన‌న్న‌ది
  • సిఎం కెసిఆర్ కేవ‌లం రైతుల సంక్షేమం కోసం మాత్ర‌మే ప్రాధాన్య పంట‌లు వేయ‌మంటున్నారు\కెసిఆర్ చెప్పిన‌ట్లుగా పంట‌లు వేసి, మంచి లాభాలు గ‌డించి, రైతులు ఎద‌గాల‌న్న‌దే కెసిఆర్ ల‌క్ష్యం

More Press News