ఉపాధి హామీ ప‌నుల‌ను పరిశీలించిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం దౌల‌త్ న‌గ‌ర్ శివారు‌ టూక్యా తండాలో ఉపాధి హామీ ప‌నుల‌ను రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామాణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పరిశీలించారు. అక్క‌డి కూలీల‌తో మాట్లాడి ఉపాధి హామీ ప‌నులు ఎలా జ‌రుగుతున్నాయ‌ని, ఏయే ప‌నులు చేస్తున్నార‌ని మంత్రి ఆరా తీశారు. క‌రోనా నేపథ్యంలో కూలీల‌కు మాస్కులు లేక‌పోవ‌డంతో వారికి వెంట‌నే త‌మ వ‌ద్దనున్న మాస్కుల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి పంపిణీ చేశారు. అలాగే, నెల్లికుదురు మండ‌లం మున‌గ‌ల‌వీడు గ్రామ పంచాయ‌తీని కూడా మంత్రి పరిశీలించారు.
మంత్రి ఎర్ర‌బెల్లి కామెంట్స్:
  • ఉపాధి హామీలో కూలీలంద‌రికీ ప‌ని క‌ల్పించాల‌ని సిఎం కెసిఆర్ చెప్పారు
  • కొత్త‌గా కూలీల‌కు జాబ్ కార్డులు కూడా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం అధికారుల‌కు చెప్పింది
  • ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చిన వ‌ల‌స కూలీల ద్వారా క‌రోనా గ్రామాల‌కు కూడా పాకుతున్న‌ది
  • ప్ర‌జ‌లు అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాలి
  • క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా స్వీయ నియంత్ర‌ణ‌, ప‌రిశుభ్ర‌త‌ని పాటించాలి
  • మాస్కులు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ, ఉపాధి ప‌నులు  చేయాలి
  • ఈ విధంగా ప‌నులు జ‌రిగేట్లుగా అధికారులు చూడాలి
  • అంద‌రికీ ఉపాధి క‌ల్పించాల‌న్న‌దే సిఎం కెసిఆర్, ప్ర‌భుత్వ ల‌క్ష్యం
  • ఉపాధి రేట్ల‌ను కూడా ప్ర‌భుత్వం పెంచింది. క‌నీసం రూ.200 దిన‌స‌రి ఉపాధి ల‌భించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాలి

More Press News