పర్యాటక, క్రీడా శాఖలపై తెలంగాణ మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష

తెలంగాణ రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పర్యాటక, క్రీడా శాఖలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ పర్యాటక, క్రీడా శాఖల పై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం హైదరాబాద్ లోని రవీంద్రభారతి లోని తన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో హైదరాబాద్ జిల్లా ఇంచార్జి, రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గోన్నారు.
 
ఈ సమీక్షా సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలోని పర్యాటక కేంద్రాల అభివృద్ది తో పాటు పర్యాటక శాఖలోని అన్ని విభాగాలు లాభాల బాటలో నడిచేందుకు అద్యయనం చేయటంతో పాటు, భూములు లీజు తీసుకున్న సంస్థల కాల పరిమితులను పరిశిలించి తదుపరి చర్యలు తీసుకోవడం పై ప్రధానంగా చర్చించారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.

తెలంగాణ పర్యాటక శాఖ కు చెందిన స్థలాల లీజులు, అద్దెల విషయంలో కోంతమంది కోర్టును అశ్రయించారో, ఆయా సంస్థలు కోర్టులలో దాఖలు చేసిన కేసులను గుర్తించి వాటిపై వెంటనే కౌంటర్ దాఖలు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. లీజు స్థలాలు ఏవైతే చిన్న చిన్న వివాదాలు, కేసులు ఉన్నాయో, లీజు హోల్డర్స్ నిబందనలకు విరుద్దంగా ఎక్స్ టేన్సన్ చేసారో వాటిన్నంటిని అద్యయనం చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు అదేశించారు. పర్యాటక శాఖ కు చెందిన స్థలాల అద్దేలు తక్కువగా వున్న వాటిని గుర్తించి వాటి లీజు , అద్దెలు పెంచటానికి చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

తెలంగాణ టూరిజం శాఖ కు చెందిన స్థలాలను కొత్తగా అభివృద్ది చేయాల్సిన ఖాళీ స్థలాలు ఎక్కడ వున్నాయే వాటిని గుర్తించి, ఒక్కోక్క ఖాళీ స్థలము పై (3) D. P. R. ( డిటేయిల్డ్ ప్రాజేక్టు రిపోర్టు ) ప్రతిపాదనలు సిద్దం చేయాలని, వాటిని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐ టి శాఖ ల మంత్రి కె టి రామారావుతో చర్చించిన తదుపరి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశానుసారం పబ్లీక్ – ప్రవేట్ భాగస్వామ్యం ( P. P. P. ) విధానం తో అభివృద్ది చేయటానికి రాష్ట్ర పురపాలక శాఖ సహాకారంతో చర్యలు తీసుకుంటామని  పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

ఈ సమీక్షా సమావేశంలో క్రీడా శాఖ అభివృద్ది పై మంత్రి చర్చించారు. రాష్ట్రంలోని అన్ని ఖాళీగా వున్న క్రీడా మైదానాలను గుర్తించి వాటిని అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలుగా అభివృద్ది చేయుటకు D. P. R. ( డిటేయిల్డ్ ప్రాజేక్టు రిపోర్టు ) లు సిద్దం చేయించి తదుపరి తగు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్.

అలాగే, తెలంగాణ పర్యాటకాభివృద్ది సంస్థ కు సంబందించిన హోటళ్లు, రెస్టారెంట్ లపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఎవైతే నష్టాలలో నడుస్తున్న వాటిని గుర్తించి లాభాల భాటలోకి వచ్చేవిధంగా తగిన ప్రతిపాదనలు తయారు చేసి వాటిని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటి శాఖ ల మంత్రి కె టి రామారావుతో చర్చించిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి సమర్పించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని మంత్రి టూరిజం శాఖ అధికారులను అదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి  అర్వింద్ కుమార్, పర్యాటక శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమీషనర్ లోకేష్ కుమార్, పర్యాటక శాఖ జాయింట్ సెక్రేటరీ కె. రమేష్, పర్యాటకాభివృద్ది సంస్థ ఎం డి మనోహర్, పర్యాటక శాఖ అధికారులు పాల్గోన్నారు.

More Press News