రక్తదానం చేయండి... ఆపన్నుల ప్రాణాలు కాపాడండి: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
- రక్త దానాన్ని మించిన దానం లేదు
- ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలు చిరస్మరణీయం
- రాయపర్తిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఐటీ, నగర పాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనతో రాయపర్తిలో పలువురు ప్రజాప్రతినిధులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి ఎర్రబెల్ల మాట్లాడుతూ, రక్త హీనత, తలసేమియా వంటి వ్యాధి గ్రస్థులకు రక్తం అవసరం, అత్యవసర సందర్భాల్లో, ప్రమాదాలు సంభవించిన సమయాల్లో, దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు రక్తం అవసరం ఉంటున్నది. రక్తం సమయానికి అందకపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది చనిపోతున్నారు. రక్తం సమయానికి అందించడం వల్లే వేలాది మంది ప్రాణాలను కాపాడవచ్చు అని మంత్రి వివరించారు. రక్తం ఇవ్వడం వల్ల అనారోగ్యం పాలవుతామనేది తప్పు. ప్రతి మూడు నెలల కోసారి రక్తం ఇవ్వవచ్చు. వంద సార్లకు పైగా ఇచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి అపోహలు నమ్మకండి. రక్తదానం చేసి, ఇతరుల ప్రాణాలు కాపాడండి అని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.
పర్వతగిరి (వరంగల్ రూరల్ జిల్లా): కరోనా కష్ట కాలంలోనూ సీఎం కెసిఆర్ రైతు బంధు నిధులు రూ.7వేల కోట్లు, 25వేల లోపు రుణాల ఏకమొత్తం మాఫీ కోసం రూ.1200 కోట్లు, ఉపాధి హామీ కింద కూలీలకు ఉపాధి కల్పించడానికి రూ.170 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రికి ఉన్న ప్రజల పట్ల నిబద్ధతను, నిజాయితీని ప్రజలకు వివరించే బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పర్వతగిరి నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు ఈ కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడాలేని విధంగా కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేస్తూ లాక్ డౌన్ ముందుగా ప్రకటించడమేగాకుండా, రైతుల పంటలను కొనుగోలు చేస్తున్న ఘనత కూడా మన సీఎం కెసిఆర్ దే అన్నారు. అలాగే ఉపాధి హామీకి, రైతు బంధుకి, రైతుల రుణమాఫీకి నిధులు మంజూరు చేసి, తన నిజాయితీని, నిబద్ధతని చాటుకున్నారని అన్నారు. సీఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ల ప్రత్యేక శ్రద్ధ వల్లే ఇదంతా సాధ్యపడుతున్నదని, వారి ముందు చూపు, పరిపాలనా దక్షతకు నిదర్శనమని మంత్రి తెలిపారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలని, ప్రజలకు ప్రభుత్వ చర్యలపై అవగాహన కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజాప్రతినిధులకు సూచించారు.
పర్వతగిరి, ములుగు (వరంగల్ రూరల్ జిల్లా, ములుగు జిల్లా): ములుగు ని ప్రత్యేకంగా జిల్లాను చేశాం. అభివృద్ధికి పాటు పడుతున్నాం. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నాం. ప్రతి మనిషికి 12కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 ఇస్తున్నాం. రైతుల పంటలను కొనుగోలు చేస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రైతు రుణ మాఫీ, రైతు బంధు, ఉపాధి హామీ నిధులు ఇస్తున్న ప్రభుత్వం మనదే ఇంత చేస్తున్న ప్రభుత్వం, సిఎం కెసిఆర్, కెటిఆర్ ల గురించి ప్రజలకు వివరించే బాధ్యతని ప్రజాప్రతినిధులే తీసుకోవాలి. ప్రజల వద్దకు వెళ్ళాలి. వారి కష్ట సుఖాల్లో భాగస్వాములు కావాలి అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో ఉన్న ఆయన, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి, ములుగు ఇన్ చార్జీ మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి చందూలాల్, డిసిసిబి డైరెక్టర్ రమేశ్, మంగపేట రైతు సహకార సంఘం చైర్మన్ నరేందర్ తదితరులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రజల కోసం ఎంతో చేస్తున్న సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పనితీరును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఒకరిద్దరు చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దన్నారు. అయితే, మన పథకాలు, ప్రభుత్వ పనితీరు, సిఎం కెసిఆర్ గారు ప్రజల పట్ల చూపుతున్న ఔదార్యాలను ప్రజలకు వివరించడం ద్వారా, ప్రజలతో మమేకం అవ్వాలని ఆయన సూచించారు. రాజకీయాలకతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా కరోనా కష్టకాలంలో అందరినీ ఆదుకోవాలని సూచించారు. సిఎం కెసిఆర్ గారి ఆదేశాలకనుగుణంగా అంతా పని చేయాలని చెప్పారు.