క‌రోనా నిర్మూల‌న‌కు రూ.2 ల‌క్ష‌ల విరాళం.. మంత్రి ఎర్రబెల్లికి అందజేసిన దాతలు

  • నియోజ‌క‌వ‌ర్గంలో వినియోగించాలంటూ మంత్రి ఎర్ర‌బెల్లికి అందచేసిన దాత‌లు‌
  • దాత‌ల‌ను అభినందించిన మంత్రి ఎర్ర‌బెల్లి
క‌రోనా నిర్మూల‌న కోసం పాటు ప‌డుతున్న తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాకర్ రావుకి మ‌రికొంద‌రు దాతలు విరాళాలు అంద‌చేశారు. ఇద్ద‌రు దాత‌లు వేర్వేరుగా చెరో ల‌క్ష రూపాయ‌లు ప్ర‌క‌టించి ఆ విరాళాలను మంత్రి ఎర్ర‌బెల్లికి అంద‌చేశారు. ఆర్యభట్ట విద్యా సంస్థల అధినేత, పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన‌ నరేష్ చంద్ర భారత్ రూ.లక్ష విరాళం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు అందించారు. అలాగే, తొర్రూరు మండ‌లం వెంక‌టాపురంకు చెందిన‌ కేతిరెడ్డి రంగారెడ్డి &సన్స్ రూ.ల‌క్ష విరాళాన్ని మంత్రికి అంద‌చేశారు. ఈ విరాళాన్ని నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా నిర్మూల‌న‌కు వినియోగించాల‌ని వారు మంత్రిని కోరారు. విరాళాలు అంద‌చేసిన దాత‌ల‌ను మంత్రి అభినందించారు. ఈ క‌ష్ట‌కాలంలో దాతలు ముందుకు రావాల‌ని, ఎక్క‌డిక‌క్క‌డ పేద‌ల‌ను ఆదుకోవాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి పిలుపునిచ్చారు.

More Press News