టీవీ సీరియల్స్ షూటింగ్ లకు అనుమతులు ఇవ్వండి: మంత్రి తలసానిని కోరిన చానళ్ళ ప్రతినిధులు
లాక్ డౌన్ కారణంగా ప్రజలు అనేకమంది ఇండ్ల లోనే ఉంటున్నారని, వారికి ఎంటర్ టైన్మెంట్ అందించేందుకుగాను టీవీ సీరియల్స్ షూటింగ్ లకు అనుమతులు ఇవ్వాలని పలు చానళ్ళ ప్రతినిధులు కోరారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఈ టీవీ సీఈఓ బాపినీడు, జీ తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్, జెమిని టీవీ బిజినెస్ హెడ్ కే,సుబ్రహ్మణ్యం, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ చైర్మన్ ప్రసాద్ లు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
టివి షూటింగ్ లకు తక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరం ఉంటుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తూ షూటింగ్ లను నిర్వహిస్తామని వారు మంత్రికి వివరించారు. కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ కారణంగా ప్రజలు బయటకు వెళ్ళలేకపోతున్నారని, వారికి ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు టీవీ సీరియల్స్ షూటింగ్ లను నిర్వహించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని వారు కోరారు. స్పందించిన మంత్రి ఈ నెల 5 వ తేదీన ముఖ్యమంత్రి అద్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ అంశంపై పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.