క్రెడిట్ సర్వీసులను అందించడానికి 'ఈజ్‌ మైట్రిప్' తో భాగస్వామ్యం ఏర్పరచుకున్న 'ఈ-పే లేటర్'

  • ట్రావెల్ బుకింగ్స్ కోసం క్రెడిట్ సర్వీసులను అందించడానికి ఈ -పే లేటర్, ఈజ్‌ మైట్రిప్ తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది
  • ఈ-పే లేటర్ తన ’బుక్ నౌ, పే లేటర్’ సదుపాయాన్ని 8 మిలియన్ల ఈజ్‌ మైట్రిప్ యూజర్స్ కు కల్పిస్తోంది

ముంబై నుండి పనిచేసే ఫిన్‌టెక్ కంపెనీ, ఈ-పే లేటర్, డిజిటల్ క్రెడిట్ మార్కెట్ లో ఒక ప్రఖ్యాత సృజనాత్మక కంపెనీ, ఇది ప్రముఖ భారతీయ ఆన్‌లైన్ ట్రావెల్ మార్కెట్ ప్లేస్ అయిన ఈజ్‌మైట్రిప్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఈపేలేటర్ వారి ’బుక్ నౌ, పే లేటర్’ సర్వీసు, ఈజ్‌మైట్రిప్ లో చేసుకునే ట్రావెల్ బుకింగ్స్ అన్నింటినీ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. దీనివలన వినియోగదారులు, ఎలాంటి చెల్లింపులు చేయకుండానే టావెల్ ను బుక్ చేసుకోవచ్చు మరియు లావాదేవీ జరిపిన తేది నుండి 14 రోజుల వరకు ఉచిత క్రెడిట్ ప్రయోజనాలను పొందవచ్చు.

ఈ కొత్త అంశం ఉపయోగించుకోవడానికి, యూజర్స్ ఈ-పేలేటర్ పై ఒకసారి సైన్ అప్ (ఇదివరకే చేయకపోతే) చేయాల్సి ఉంటుంది, అప్పుడు వారికి ఒక క్రెడిట్ పరిమితి కేటాయించబడుతుంది. ఈ క్రెడిట్ పరిమితి, ఈజ్‌మైట్రిప్ పోర్టల్ పై లావాదేవీ నడుపుటకు ఉపయోగించుకోవచ్చు మరియు కేవలం ఒక్క ట్యాప్ తో ఈ లావాదేవీని పూర్తి చేసుకోవచ్చు. ఇంకా, యూజర్స్, తదుపరి తేదీలలో సరళమైన మరియు కనిష్ట ఆన్‌లైన్ దశలలో తిరిగిచెల్లింపును సులభంగా చేయవచ్చు. ఈ-పేలేటర్  వినియోగించడం యూజర్స్ కు మరింత సౌకర్యవంతంగా, త్వరితంగా మరియు అసమానంగా చేసే అంశం ఏమిటంటే, యూజర్స్, చెక్ అవుట్ ప్రక్రియ సమయంలో, తమ బ్యాంక్ అకౌంట్ లేదా కార్డు వివరాలను టైప్ చేయాల్సిన పనిలేదు లేదా చెల్లింపు యొక్క ఈతర మోడ్స్ ఉపయోగించాల్సిన పనిలేదు.

ఈ భాగస్వామ్యంపై వ్యాఖ్యానిస్తూ, ఉదయ్ సోమయాజుల, కో-ఫౌండర్, ఈ-పేలేటర్, ఈలా అన్నారు, "ఈజ్‌మైట్రిప్ తో ఈ-పేలేటర్ యొక్క భాగస్వామ్యం, ట్రావెల్ విభాగంలో మేము దృష్టిసారించుటకు ఒక ప్రయత్నం. ఈ అనుబంధం ఏర్పరచుకున్నందుకు మాకు ఆనందంగానూ గర్వంగానూ ఉంది, ఎందుకంటే, ఈది ఏకరూప ఆలోచనలు గల రెండు కంపెనీలను ఒక్కటిగా కలిపి దేశంలోని ట్రావెల్ బుకింగ్స్ ను పునర్నిర్వచిస్తుంది కాబట్టి. ఇది ఒక అవకాశపూర్వక క్షణం అని మేము విశ్వసిస్తున్నాము, ఎందుకంటే, ట్రావెల్, ప్రత్యేకంగా వాయుప్రయాణం, అనేది ఇటీవలి కాలంలో ఒక ఆల్ రౌండ్ మరియు శక్తివంతమైన ఎదుగుదల యొక్క స్థిరమైన పరిధిలో సాగుతోంది. కొత్త విమానాశ్రయాలు మరియు పెరుగుతున్న ఆదాయ స్థాయిలకు ధన్యవాదములు. ఈ-పేలేటర్ అనేది ఒక అత్యంత సౌకర్యవంతమైనది మరియు తక్షణ-క్రెడిట్ అందించేదిగా ఉండి, గొప్ప ఉత్పాదన-మార్కెట్ ఫిట్ ను గురిమ్చి, తద్వారా మాస్ స్థాయిలో కూడా స్వీకరించునట్లు చేస్తుంది."  

ఈ కొనసాగింపు గురించి మాట్లాడుతూ, నిషాంత్ పిట్టి, సిఈఓ, ఈజ్‌మైట్రిప్, ఇలా అన్నారు, "కొన్నిసార్లు, వినియోగదారులు ఆకాశాన్నంటే విమాన ఛార్జీలు, పెరిగే హోటల్స్ మరియు ఈతర బడ్జెట్ కారకాల వలన తమ సెలవుదినాలు మరియు యాత్రలను మానుకుంటారు. ఇంకా, చాలామంది వినియోగదారులు, వారి ప్రయాణాలను బుక్ చేసుకోవడానికి ఆఫర్స్ మరియు డిస్కౌంట్ల కోసం చాలాకాలం వేచి ఉండాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలలో వారికి క్రెడిట్ సదుపాయం దొరికితే, వారు వారి ప్రయాణ ఖర్చుల గురించి అంత ఆందోళన చెందరు. ఈ-పేలేటర్ తో ఈ భాగస్వామ్యంతో, మేము మా వినియోగదారుల ట్రావెల్ బడ్జెట్ కు సంబంధించిన అన్ని సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు మరియు అసమానమైన ట్రావెల్ అనుభవాలను అందించవచ్చు."

ఈజ్‌మైట్రిప్ యూజర్స్ కు వారి టికెట్లకు తరువాత చెల్లించవచ్చనే ఎంపిక అందించడం వలన, వారి బుకింగ్ అనుభవం సరళీకృతం కావడమే కాకుండా, క్రెడిట్ ను మరింతగా చేర్చడం ద్వారా, దానిని అసమానంగా మరియు సురక్షితంగా చేస్తుంది.

ఈ-పేలేటర్ గురించి:

2015 లో ఉదయ్ సోమయాజుల, ఆర్కో భట్టాచార్య మరియు అక్షత్ సక్సేనా ద్వారా స్థాపించబడిన, ఈ-పేలేటర్ అనేది ’ఇప్పుడే కొనండి, తరువాత చెల్లించండి’ అనే చెల్లింపు పరిష్కారాన్ని అందిస్తోంది, దీనితో వినియోగదారులు, వేగవంతమైన ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ కొనుగోళ్ళు చేయదానికి క్రెడిట్ పరిమితిని తక్షణమే పొందగలరు. ఒకసారి సైనప్ చేస్తే, వినియోగదారుడు రూ. 20,000 ల వరకు క్రెడిట్ పరిమితిని పొందవచ్చు. చెల్లింపును సెటిల్ చేయడానికి కొనుగోలు తేది నుండి 14-రోజుల వడ్డీ-రహిత కాలవ్యవధి లభిస్తుంది. ఈ-పేలేటర్ కు 1000 మందికి పైగా వ్యాపారులు ఉన్నారు, వీరిలో ఐఆర్‌సిటిసి, పివిఆర్, మేక్ మై ట్రిప్, టాటా క్రోమా, యాత్ర అనేవి కొన్ని. యుపిఐ అంగీకరించు వ్యాపార స్థంస్థలతో కూడా లావాదేవీలు జరుపుటకు దీనిని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం, ఈ-పేలేటర్ యుపిఐ ను, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, జబాంగ్, మింత్ర మరియు ఉబెర్ లో ఉపయోగించుకోవచ్చు.
 
వెబ్‌సైట్- https://www.epaylater.in/

ఈజ్‌మైట్రిప్ గురించి:

ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ (EaseMyTrip.com) ఢిల్లీలోని ఒక ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ, ఇది మే 2008 లో రికాంత్ పిట్టి మరియు నిషాంత్ పిట్టిల ద్వారా స్థాపించబదింది. ఈ కంపెనీ, భారత యాత్రా పరిశ్రమలో ప్రముఖమైన సంస్థ మరియు ఉత్తమ డీల్స్ అందించుటలో పేరెన్నిక కలిగినది. 42,000 నమోదు చేసుకున్న శక్తివంతమైన నెట్వర్క్ తో మరియు 8 మిలియన్ కంటే ఎక్కువమంది డైరెక్ట్ వినియోగదారులతో, ఈ కంపెనీ తన ఏజెంట్ నెట్వర్క్, కార్యాలయాలు మరియు ఫ్రాంచైజీలను దాదాపు పిన్ కోడ్ ఉన్న అన్ని ప్రాంతాలలోనూ కలిగి ఉంది.
వెబ్‌సైట్- https://www.easemytrip.com/ 

More Press News