కాళేశ్వరం కాలువ పనులపై మంత్రి హరీశ్ రావు సమీక్ష

మెదక్: కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రింద జిల్లాలో కాలువల నిర్మాణానికి గాను అవసరమైన భూమి సేకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో కాళేశ్వరం కాలువ పనులపై సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ కాలువ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ జిల్లాలో కాలువకు అవసరమైన భూమి సేకరణ త్వరగా సేకరించాలని నిధులకు ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు.

అధికారులకు ఎటువంటి ఇబ్బందులు వున్నా తన దృష్టికి తీసికొనిరావలెనని, పెండింగ్ వర్క్స్ త్వరితిగతిన పూర్తి కావాలెను అని స్పష్టం చేశారు. అధికారులు అందరు సమన్వయముతో ముందుకు పోవాలని అన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ను మే నెల 15వ తేదీ వరకు పనులు పూర్తి కావలెనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం అన్నపూర్ణగా మారుతుందని, ప్రతి ఎకరాకు కాలువ కింద వున్నా ఆనకట్టలు అన్ని కూడా త్వరగా పూర్తి కావలెను అని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశములో ఎంపీ కే.ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

More Press News