కరోనా పట్ల భయం వద్దు.. అజాగ్రత్త వద్దు: హరీశ్ రావు

  • జాగ్రత్తలు, పౌష్టకాహారంతో కరోనాను ఎదుర్కోవచ్చు
  • మాస్క్ లేకుండా బయటకు రావద్దు. శుభ్రత పాటించండి
  • మున్సిపల్ సిబ్బందికి శానిటైజర్స్ పంపిణీ
  • మెదక్  జిల్లా చిన్న శంకరం పేటలోని  ఓ ఫంక్షన్ హాలులో ఆర్థిక మంత్రి హరీశ్ రావు

హరీశ్ రావు కామెంట్స్:
  • శానిటైజర్స్ ఇస్తున్నారంటే మున్సిపల్ సిబ్బంది బాగుగా ఉండాలన్న ఆలోచన
  • మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి
  • కరోనా విషయంలో జాగ్రత్త ఉండాలి. మీరు ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి
  • కరోనాకు ఉపాయాలు ఉన్నాయి
  • మాస్క్ లేకుండా  బయటకు రావద్దు
  • సబ్బుతో రోజుకు నాలుగైదు సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి
  • బయట నుంచి  ఇంటికి వచ్చాక బట్టలు మార్చుకోవాలి, స్నానం చేసి వేరే దుస్తులు ధరించాలి
  • కరోనా వైరస్ నుంచి బయట పడాలంటే... రోజుకు మూడు సార్లు వేడి నీళ్లు తాగండి. ఫ్రిజ్ నీళ్లు తాగవద్దు
  • జలుబు అయితే ముఖానికి ఆవిరిపట్టండి. పసుపు నీళ్లతో ఆవిరి పట్టండి
  • ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి, కోడి గుడ్లు, పాలు వంటి ఆహారం తీసుకోవాలి
  • సిట్రస్ ఉన్న  నిమ్మ, సంత్రా, బత్తాయి వంటి పండ్లు తీసుకోండి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
  • కరోనా పట్ల భయం వద్దు, అలక్ష్యం వద్దు. జాగ్రత్తలు తీసుకోండి
  • మనల్ని మనం కాపాడుకుంటూ సమాాజాన్ని కాపాడుదాం
  • పారిశుధ్య పనులు పట్టణాల్లో, పంచాయతీల్లో ఆగకూడదని ప్రభుత్వం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కింద నిధులు విడుదల చేస్తోంది. కరోనా వచ్చినా ఈ నిధులు ఆపలేదు
మెదక్ టౌన్ లోని  ఓ ఫంక్షన్ హాలులో నాయినీ బ్రాహ్మణులకు, పాస్టర్లకు
సరుకుల పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

 

.

More Press News