హైటెక్స్ లో 'ఆక్వా ఆక్వేరియా ఇండియా' ను నిర్వహిస్తాం: తలసాని

దేశంలో అక్వాకల్చర్ రంగం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో MPEDA (Marine Products Export Development Authority) హైదరాబాద్ లో ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 1 వరకు HITEX లో అక్వా అక్వేరియా ఇండియా ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రి తలసాని యాదవ్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, MPEDA ల మధ్య రాష్ట్రం నుండి అక్వాకల్చర్ ఎగుమతుల అభివృద్ధిని ఉద్ధేశించి MoU జరిగింది.  MPEDA  ఛైర్మన్ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పశుసంవర్ధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా లు MoU మార్చుకున్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అక్వాకల్చర్ అభివృద్ధికి సహకరించడానికి MPEDA ముందుకు రావడం అభినందనీయమని Aqua Aquaria India విజయవంతం కావడానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు.

హేచరీలు, నర్సరీలు ట్రైయినింగ్ సెంటర్ లతో  Multi Species Aqua Centre ను తెలంగాణలో ఏర్పాటు చేస్తారు. హైదరబాద్ ఎయిర్ పోర్టు లో Aquatic Quarantine Facility, Chilled fish, Live fish హ్యాండ్లింగ్ కు సాంకేతిక సహాయాన్ని MPEDA సొసైటీల ద్వారా అందివ్వడానికి అవకాశం కలుగుతుంది. తెలంగాణ Water Bodies లో ఎగుమతులను ఉద్దేశించి Cage Culture Policy  తయారుచేయడానికి MPEDA సహకారం అందిస్తుంది. National Centre for Sustainable Aquaculture  ద్వారా రైతులను Cluster లుగా విభజించి మెరుగైన యాజమాన్య పద్ధతులను, మెళకువలను నేర్పిస్తారు.

పశు సంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ మాట్లాడుతూ తెలంగాణలో ఇటువంటి సదస్సు నిర్వహించడం గర్వకారణమని, విజయవంతం కావడానికి అన్ని శాఖలు తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలీసు శాఖ ద్వారా బందోబస్తు, ఆర్ టి సి ద్వారా బస్సులు, జిహెచ్ఎంసి, ఫైర్, I&PR శాఖలు తగు చర్యలు తీసుకుంటాయని, వివిధ శాఖలు చేయవలసిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. MPEDA ఛైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ Aqua Aquaria India సదస్సు విజయవంతం కావడానికి తెలంగాణ ప్రభుత్వం సహాయసహకారాలు అందివ్వడం అభినందనీయం అన్నారు. MPEDA తెలంగాణ నుండి అక్వా ఎగుమతుల అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. తెలంగాణలో ఉన్న జలవనరుల ద్వారా అక్వా ఎగుమతుల అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయన్నారు. Aqua Culture Show లో  250 స్టాల్స్ ఉంటాయని, Harvest Technology Macrium, Live Demonstrations, Varieties of Fish Species ఉంటాయన్నారు. వివిధ రాష్ట్రాల నుండి రైతులు పాల్గొంటారన్నారు.

అక్వా కల్చర్ చేపట్టేలా రైతులను ప్రోత్సహించడం ప్రధాన ఉద్ధేశ్యమన్నారు. Inland water లో Aqua ను ప్రోత్సహిస్తామన్నారు. మత్స్య ఎగుమతుల పెంపు ప్రధాన ఉద్ధేశ్యమన్నారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ కమీషనర్ సువర్ణ, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ నాగయ్యకాంబ్లే, పోలీసు, ఆర్ టి సి, MPEDA అధికారులు పాల్గొన్నారు.

More Press News