మూడు కేట‌గిరీల్లోనూ తెలంగాణ‌లోని మూడు గ్రామాలు ఎంపికై త‌మ స‌త్తాని చాటాయి: మంత్రి ఎర్రబెల్లి

పంచాయ‌తీ రాజ్ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా దేశ స్థాయిలో కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే పంచాయ‌తీ అవార్డుల‌ను గెలుచుకున్న గ్రామ పంచాయ‌తీల‌కు, స‌ర్పంచ్ లు, వార్డు స‌భ్యులు, ప్ర‌జ‌ల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు శుభాకాంక్ష‌లు తెలిపారు.

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కామెంట్స్:
  • నానాజీ దేశ్ ముఖ్ గౌర‌వ్ గ్రామ స‌భా పుర‌స్కార్ (ఎన్ డిఆర్ జిజిఎస్ పి) కేట‌గిరీలో పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గిరి మండ‌లం ఆదివారం పేట గ్రామ పంచాయ‌తీ  ఉత్త‌మంగా ఎంపికైంది
  • చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయ‌తీ అవార్డు (సిఎఫ్‌జిపిఎ) కేట‌గిరీ కింద క‌రీంన‌గ‌ర్ జిల్లా తిమ్మాపూర్ (ఎల్.ఎం.డి) మండ‌లం నుస్తులాపూర్ ఉత్త‌మంగా ఎంపికైంది
  • గ్రామ పంచాయ‌తీ డెవ‌ల‌ప్ మెంట్ ప్లాన్ (జిపిడిపి) కింద జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లా కాటారం మండ‌లం గంగారం గ్రామం ఉత్త‌మ గ్రామంగా ఎంపికైంది
  • జాతీయ స్థాయికి ఆయా గ్రామాలు ఉత్త‌మంగా ఎంపిక‌వ‌డం ఆ గ్రామ పంచాయ‌తీల ప‌నితీరుకే గాక‌, తెలంగాణ సీఎం కెసిఆర్ గారి పాల‌న‌, ప‌నితీరుకు కూడా నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి
  • తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న అనేక చ‌ర్య‌లు, విధానాలు గ్రామ పంచాయ‌తీల బలోపేతానికి కార‌ణ‌మ‌వుతున్నాయి
  • ఆయా గ్రామ పంచాయ‌తీలు మి‌గ‌తా పంచాయ‌తీల‌కు ఆద‌ర్శంగా నిలిచాయి. ఈ గ్రామ పంచాయ‌తీల స్ఫూర్తితో మిగ‌తా గ్రామ పంచాయ‌తీలు మ‌రింత ఉత్త‌మ‌గా నిల‌చేందుకు కృషి చేయాలి
  • ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యాన్ని పెంచితేనే గ్రామాలు బాగా అభివృద్ధి చెందుతాయి
  • ప్ర‌జ‌లు-ప్ర‌జాప్ర‌తినిధులు-అధికారులు స‌మ‌న్వ‌యంగా ప‌ని చేస్తేనే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి
  • ఆయా గ్రామ పంచాయ‌తీలు ఉత్త‌మంగా నిల‌వడానికి కార‌ణ‌మైన సిఎం గారికి కృత‌జ్ఞతలు, అలాగే ఆయా గ్రామ పంచాయ‌తీల ప్ర‌జ‌లు, స‌ర్పంచ్ లు, వార్డు స‌భ్యులు, అధికారులంద‌రికీ ధ‌న్య‌వాదాలు, అభినంద‌న‌లు

More Press News