ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యం: గాంధీ ఆసుపత్రి వైద్య నిపుణులు

హైదరాబాద్: ప్రజల సహకారంతోనే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యం అవుతుందని గాంధీ  ఆసుపత్రి, వైద్య నిపుణులు డాక్టర్ రవీందర్ కుమార్ తెలిపారు. శుక్రవారం నాడు మాసబ్ ట్యాంక్ లో గల సమాచార, పౌర సంబంధాల శాఖ బోర్డు రూంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాంధీ ఆస్పత్రి  వైద్య నిపుణులు డాక్టర్ రవీందర్ కుమార్, అపోలో హస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ స్వర్ణ దీపక్ సంయుక్తంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ కుమార్ మాట్లాడుతూ, కరోనా వైరస్  ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని తెలిపారు. కరోనా వైరస్ మందులకన్నా ప్రజలు పాటించే ముందస్తు జాగ్రత్తలతోనే నివారించవచ్చు అని అన్నారు. లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు గౌరవించి ఇండ్లలోనే ఉండాలని తెలిపారు. ప్రజలు తరచూ చేతులు శుభ్రపరుచుకోవడం, వీలైనంత వరకు జన సమూహాలకు దూరంగా ఉండటం పాటించాలని అన్నారు. కరోనా వైరస్ వస్తువులపైనా సజీవంగా ఉంటున్నదని, ఆ వస్తువులను ఒకవేల ముట్టుకున్నట్లైతే తప్పని సరిగా సబ్బు నీటితోగాని, శానిటైసజర్ తోగాని శుభ్రపరుచుకోవాలని అన్నారు. ఈ వైరస్ వలన ప్రతి వంద మందిలో 95 శాతం మందికి ప్రమాదమేమీ ఉండదని తెలిపారు. వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వారు ఈ సమయంలో వైద్యపరమైన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

కరోనా వైరస్ లక్షణాలు ఉంటే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించాలని, ఆలస్యం చేస్తే మిగతా వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్యం అన్ని చర్యలు తీసుకుంటుందని, సమాజ శ్రేయస్సు దృష్ట్యా మనమందరం ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు. కొంత మందికి కరోనా వైరస్ లక్షణాలు లేనప్పటికీ వారు వాహకాలకుగా మారుతున్నందున వారు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించారు. ఇప్పటి వరకు 186 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కరోనా వైరస్ లక్షణాలతో వచ్చిన చిన్న పిల్లలు అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ప్లాస్మా ధెరపి కేరళ ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చిందని అన్నారు. తెలంగాణలో కూడా వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. రాపిడ్ టెస్ట్ కిట్స్ కూడా త్వరలోనే  చేరతాయని తెలిపారు. వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా వైరస్ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అపోలో ఆసుపత్రి కన్సల్టెంట్ డాక్టర్ స్వర్ణ దీపక్ మాట్లాడుతూ స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వ్యాప్తి ని అరికట్టవచ్చు అన్నారు. ఎన్ 95 మాస్క్ లను ప్రతి ఒక్కరు వాడవలసిన అవసరం లేదని , మామూలు మస్క్ కానీ, బట్టను కానీ వాడిన ఫరవాలేదు అన్నారు. ప్రభుత్వ  ప్రకటించిన ప్రకారం లాక్ డౌన్ ను తప్పకుండా పాటించాలన్నారు. అనవసరంగా బయటకు రావద్దని ఆయన సూచించారు. దగ్గు, జలుబు,జ్వరం వస్తే భయపడకుండా మొదటగా స్వీయ నిర్బంధం లో వుంటూ డాక్టర్ ను సంప్రదించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 104 కు సంప్రదించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న లాక్ డౌన్ చర్యలకు సంఘీభావం తెలుపుతూ పోలీస్, మీడియా వాళ్లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్  నాగయ్య కాంబ్లే, ఇంచార్జి సి.ఐ.ఇ. విజయ్ భాస్కర్ రెడ్డి, డి.డి. శ్రీనివాస్, అసిస్టెంట్  డైరెక్టర్ యామిని, ఆర్.ఐ . రాధా కిషన్, తదితరులు పాల్గొన్నారు.

More Press News