కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించేందుకు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి: నిమ్స్ వైద్య నిపుణులు
హైదరాబాద్: దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించేందుకు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ పరంజ్యోతి సూచించారు. బుధవారం నాడు మాసబ్ ట్యాంక్ లో గల సమాచార పౌర సంబంధాల శాఖ బోర్డు రూంలో కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిమ్స్ వైద్య నిపుణులు డాక్టర్ పరం జ్యోతి, అపోలో హస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీకాంత్ సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పరం జ్యోతి మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కబళిస్తున్నదని తెలిపారు. దేశంలో లాక్ డౌన్ ను అందరూ పాటించాలని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గ దర్శక సూత్రాలు శాస్త్రీయమైనవని, తప్పక పాటించడం ప్రజలందరికి ష్రయస్కరమని అన్నారు. మాస్కులు ఏవైనా పరవాలేదని, మాస్కులు లేకపోతె కచ్చితంగా దస్తీలైన ఉపయెగించాలని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి కి హద్దులు ఉండవని, నియంత్రణే ఏకైక మార్గమని తెలిపారు. ప్రజలు బయట తిరుగుతుంటే వైరస్ సోకె సంఖ్య కూడా పెరుగుతున్నదని దాని వలన బాధితుల్ల సంఖ్య పెరిగి హాస్పత్రిలపై వత్తిడి పెరుగుతుందని తెలిపారు. కరోనా వైరస్ నిర్ములనకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని, అప్పటివరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మనిషి నుండి మనిషి తప్పక సామజిక దూరం పాటించాలని తెలిపారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కరోనా వైరస్ సోకె అవకాశం ఎక్కువగా ఉంటున్నది కనుక ఈ సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్ కట్టడికి వైద్యులు, పోలీసులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని, ప్రజలందరూ సహకరిస్తేనే కరోన వైరస్ పై విజయం సాధిస్తామని తెలిపారు.
అపోలో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కరోనా వైరస్ 209 దేశాలలో కొన్ని వారాలలో నే వ్యాప్తి చెందిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రస్తుతం మరణాల శాతం 3శాతం- 3.5 శాతం వుందన్నారు. ముఖ్యంగా ఇతర వ్యాధులతో బాధపడే వారు,పెద్ద వయసు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి అని అన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ సత్ఫలితాలు ఇస్తుందన్నారు. ప్రజలు లాక్ డౌన్ కు సమర్దవంతంగా సంఘీభావం తెలపాలని అన్నారు.
సమిష్టిగా కృషి చేస్తే కరోనా వ్యాప్తి ని అరికట్టవచ్చు అన్నారు.కరోనా వ్యాప్తి చెందకుండా భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను విరివిగా కడుకోవడం,లాక్ డౌన్ ను కచ్చితంగా పాటించాలన్నారు. మందులు , వాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయని , దానికి కొంత సమయం పడుతుందన్నారు. కొంత మందికి కరోనా వైరస్ లక్షణాలు లేకపోయినప్పటికీ వారి ద్వారా వేరే వ్యక్తులకు వైరస్ వ్యాప్తి పెరుగుతున్నదని ఆందోలన వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్ జగన్, ఇంచార్జి సి.ఐ.ఇ. విజయ్ భాస్కర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని, తదితరులు పాల్గొన్నారు.