క‌రోనా క‌ష్ట కాలంలోనూ గ్రామ పంచాయ‌తీల‌కు రూ.307 కోట్ల నిధుల మంజూరు: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

*సిఎం ముందు చూపు, ఔదార్యానికి ఇదే నిద‌ర్శ‌నం*

*సిఎం కెసిఆర్ కి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు*

*ప‌ల్లె ప్ర‌గ‌తి, పారిశుద్ధ్యం, క‌రోనా నిర్మూల‌న‌కు ముందు జాగ్ర‌త్త‌లు... ప్రాథామ్యాలుగా ప‌ని చేయాలి*

*పెండింగ్ క‌రెంటు బిల్లులు క‌ట్టండి - 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు స‌హ‌క‌రించండి*

*పారిశుద్ధ్య ర‌సాయ‌నాలు, ప‌రిక‌రాల కొర‌త లేకుండా చూసుకోవాలి*

*ప‌ల్లె ప్ర‌గ‌తి ప్రేర‌ణ‌గా ప‌ల్లెల్లో ప్ర‌తి రోజూ పారిశుద్ధ్యం జ‌ర‌గాలి*

*పారిశుద్ధ్య కార్మికులు సామాజిక‌, భౌతిక దూరం పాటించాలి*

*ప్ర‌తి నిత్యం పంచాయ‌తీ అధికారులు, స‌ర్పంచ్ లు, కార్య‌ద‌ర్శులు ప‌ర్య‌వేక్షించాలి*

*ఎట్టి ప‌రిస్థితుల్లోనూ న‌యా పైసా దుబారా జ‌ర‌గొద్దు*

*నిధుల దుర్వినియోగం జ‌రిగితే చ‌ర్య‌లు త‌ప్ప‌వు*

*ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌కు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆదేశాలు*

హైద‌రాబాద్, ఏప్రిల్ 15: "ఆర్థిక మాంద్యం, క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ప‌ల్లెల ప్ర‌గ‌తి, పారిశుద్ధ్యం, క‌రోనా నిర్మూల‌న‌పై ప్ర‌త్యేక శ‌ద్ధ చూపిస్తున్నారు. డ‌బ్బుల ఇబ్బందుల్లోనూ గ్రామ పంచాయ‌తీల‌కు రూ.307 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేశారు. ఇది సిఎం గారి ముందు చూపున‌కు, కెసిఆర్ గారి ఔదార్యానికి నిద‌ర్శ‌నం. ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు" అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.   మార్చి నెల‌కు సంబంధించి గ్రామ పంచాయ‌తీల‌కు రూ.307 కోట్లు ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన సంద‌ర్భంగా మంత్రి స్పందించారు.

సిఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు ఆ నిధుల్లో న‌యా పైస వృథా జ‌ర‌గొద్ద‌ని గ్రామాల స‌ర్పంచ్ లు, అధికారుల‌ను ఆదేశించారు. అంతేగాక‌, ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ప్రేర‌ణ‌గా... పారిశుద్ధ్యం, క‌రోనా నిర్మూల‌నే ల‌క్ష్యాలుగా ఆ నిధుల‌ను ఖ‌ర్చు చేయాల‌ని సూచించారు. ప్ర‌తి రోజూ పారిశుద్ధ్యం ప‌నులు నిర్వ‌హించాల‌న్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పారిశుద్ధ్య లోపం ఏ గ్రామంలోనూ క‌నిపించ‌వ‌ద్ద‌న్నారు. డ్రైనేజీల‌ను శుభ్రం చేయ‌డం, క‌రోనా నేప‌ధ్యంలో రోడ్లు, వీధుల‌ను శుభ్రం చేయ‌డం, ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ, చైత‌న్య ప‌ర‌చ‌డం చేయాల‌న్నారు. ఆయా ప‌నుల‌ను ప్ర‌తి నిత్యం స‌ర్పంచ్ లు, అధికారులు, గ్రామ కార్య‌ద‌ర్శులు ప‌ర్య‌వేక్షించాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ఆదేశించారు. పారిశుద్ధ్య ర‌సాయ‌నాలు, ప‌రికాల కొర‌త లేకుండా చూసుకోవ‌ల‌ని సూచించారు.

మంజూరైన నిధుల‌ను గ్రామ పంచాయితీల వారీగా కేటాయిస్తార‌ని, ఆయా నిధుల్లోంచి ముందుగా పెండింగ్ క‌రెంటు బిల్లులను చెల్లించాల‌ని, త‌ద్వారా ప్ర‌భుత్వం నిరాటంకంగా అందిస్తున్న 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం లేకుండా స‌హ‌క‌రించాల‌ని ఆదేశించారు.

ఇక ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల్లో నిర్దేశించుకున్న విధంగా పారిశుద్ధ్య ప‌నులు నిరంత‌రం కొన‌సాగాల‌న్నారు. క‌రోనా నేప‌థ్యంలో పారిశుద్ధ్య కార్మికులు సామాజిక‌, భౌతిక దూరాన్ని పాటించాల‌ని మంత్రి సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు మాస్కులు ధ‌రించాల‌ని, ఒక‌వేళ మాస్కులు అందుబాటులో లేక‌పోతే, ద‌స్తీలు, తువ్వాల‌లు ముఖాల‌కు చుట్టుకోవాల‌ని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌పై స‌ర్పంచ్ లు, అధికారులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి చెప్పారు. అయితే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ గ్రామ పంచాయ‌తీ నిధుల‌ను దుర్వినియోగం కానివ్వొద్ద‌ని, దుబారా ఖ‌ర్చులు చేయొద్ద‌ని, అలా చేసిన వాళ్ళ‌పై క‌ఠిన చ‌ర్య‌లుంటాయ‌ని మంత్రి హెచ్చ‌రించారు.

More Press News