పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్

కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా అమలు చేయ బడుచున్న లాక్  డౌన్ ను సమర్ధంగా ఎదుర్కొనేందుకు తమ సంస్థ ప్లాంటేషన్లు విస్తరించి ఉన్న అటవీ గ్రామాలలో పేదలకు నిత్యావసర వస్తువులను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చేపట్టింది. ప్లాంటేషన్ నిర్వహణ పనులు చేయుచున్న నిరుపేద గ్రామీణులను, క్షేత్రస్థాయి సిబ్బందిచే గుర్తించబడివారికి నిత్యావసరాలు (వంటనూనె, పప్పు, కారం, పసుపు, సబ్బులు వగైరా) వితరణ కార్యక్రమం FDC చేపట్టింది. 11 జిల్లాల్లోని 69గ్రామాలు, కుగ్రామాలు, తండాలలో నివసిస్తున్న 908 కుటుంబాల వారికి సుమారు 3.95 లక్షల రూపాయల విలువ గల సరుకులు వారి ఇళ్ల వద్దనే పంపిణీ చేయడము జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ క్షేత్ర సిబ్బంది విజయవంతంగా నిర్వహించారని FDC వైస్ చైర్మన్, MD పీ.రఘువీర్ తెలిపారు.

More Press News