విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
హాజరైన ప్రభుత్వ ఇంధనశాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా ట్రాన్స్కో&జెన్కో సియండి దేవులపల్లి ప్రభాకర్ రావు,యస్ పి డి సిఎల్సి యండి రఘుమారెడ్డిలు
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి
మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్:
కరోన మహమ్మారి ని ఎదుర్కోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలను లాక్ డౌన్ కొనసాగుతోంది
లాక్ డౌన్ లో వినియోగదారులకు మా విద్యుత్ సంస్థ నిరంతరం కష్టపడి పని చేస్తున్నారు
ప్రజలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా విద్యుత్ 24 గంటల సరఫరా చేస్తున్నాం
ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది రాకుండా విద్యుత్ సరఫరా చేస్తున్న మా సిబ్బందికి అభినందనలు
ఈ మధ్య కాలంలో అకాల వర్షాలు వచ్చిన నేపథ్యంలో ఎక్కడ కూడా ట్రాన్స్ పర్మర్ లకు ఇబ్బంది రాలేదు
అయితే విద్యుత్ వినియోగానికి సంబంధించి విద్యుత్ బిల్ లను ఆన్లైన్ లో బిల్ పే చేయాలని కోరుతున్నాం
బిల్ కు సంబంధించి రీడింగ్ తీసే అవకాశం లేదు కాబట్టి మా సిబ్బంది ఇండ్లలోకి వెళ్లే ఆస్కారం లేదు కాబట్టి మిగతా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానం లో మనం బిల్ ఇస్తున్నాం
ఇఆర్సీ రెగ్యులేటరీ ఏ విధానం అయితే ఉంటుందో అదే విధానంలో గత సంవత్సరం మార్చ్ నెల వచ్చిన బిల్ ఆధారంగా బిల్ పే చేయాలి అన్నారు అయితే అంతేకాదు ఈఆర్సీ ఇచ్చిన సూచనలు ప్రకారమే తీస్తున్నారు. కానీ గత మార్చి నెల తో పోల్చితే ఈ మార్చి నెలలో 15,20 శాతం ఎక్కుకాగానే వస్తాయి కానీ ఇఆర్సీ ప్రకారం చెల్లించాలి
ఇప్పటికే మీకు బిల్ లు పంపడం జరిగింది మీరు దయచేసి బిల్ పే చేయండి
ఈ నెలలో వ్యత్యాసాలను వచ్చే నెలలో ఇస్తాం
వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకొము
Spdcl పరిధిలో 40 శాతం పైగా వినియోగదారులు ఆన్లైన్ లోనే పే చేస్తున్నారు
10700 కమర్షియల్ లలో అక్చల్ రీడింగ్ తీసుకొని బిజినెస్ సంస్థలకు బిల్ ఇచ్చాము
కమర్షియల్ కూడా గత సంవత్సరం లో 50 శాతం బిల్ కట్టాలి
ఒక్కవేళ ఎక్కువ బిల్ కట్టిన వచ్చే బిల్ లో అడ్జెస్ట్ చేస్తాం
ఈనెల బిల్ డిమాండ్ Tsspdcl లో ఎల్టీ కి 620 కోట్ల రూపాయలు, npdcl లో 203 కోట్ల రూపాయలు
విద్యుత్ సంస్థలు ఎప్పుడు కూడా ఎమెర్జెన్సీ సమయంలో పని చేస్తున్నారు. వైద్యులు కూడా ఇలాంటి క్లిష్టమైన సందర్భంలో పని చేస్తున్నారు
విద్యుత్ ఉద్యోగులు చాలా సందర్భలలో పని చేస్తున్నారు వారికి ఇలాంటి ఆశలు ఉండవు
8900 డిమాండ్ గత మార్చ్ లో ఉండే కానీ ఇప్పుడు ఈ మార్చ్ లో 7800 డిమాండ్ ఉంది
కరోనా వైరస్ లేకుంటే 13500 మెగా వాట్స్ డిమాండ్ వస్తుంది అననుకున్నాం