క‌రోనా క‌ట్ట‌డిలో దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ‌: మంత్రి ఎర్రబెల్లి

  • లాక్ డౌన్ కి ప్ర‌జ‌లు చిత్త‌శుద్ధితో అత్భుతంగా స‌హ‌క‌రిస్తున్నారు

  • అందువ‌ల్లే మ‌న రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కంట్రోల్ లో ఉంది

  • లాక్ డౌన్ కి సిన్సియ‌ర్ గా స‌హ‌క‌రిస్తున్న ప్ర‌జ‌లంద‌రికీ ధ‌న్య‌వాదాలు

  • కేంద్రం, నిపుణులు, సంస్థ‌ల సూచ‌న‌ల మేర‌కే లాక్ డౌన్

  • సిఎం కెసిఆర్, కేబినెట్ నిర్ణ‌య‌మేదైనా... ప్ర‌జ‌లు పూర్తిగా క‌ట్టుబ‌డి ఉండాలి

  • క‌రోనా క‌ట్ట‌డి అయ్యే వ‌ర‌కు... ప్ర‌జ‌లు మ‌రింత‌గా స‌హ‌క‌రించాలి

  • అన్ని స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వ‌మే క‌ల్పిస్తున్న‌ది

  • వ‌ల‌స కార్మికుల‌ను కూడా ఆదుకుంటున్నాం

  • నిరుపేద‌ల‌కు 12కిలోల బియ్యం, రూ.1500 ఆర్థిక స‌హాయం అందిస్తున్నాం

  • ధాన్యం, మ‌క్క‌ల‌ను ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్త‌న్న‌ది

  • రైతులు, ప్ర‌జ‌లు అధైర్య ప‌డాల్సిన ప‌నిలేదు

  • క‌రోనా వైర‌స్ నిర్మూల‌న‌కు ప‌ని చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ చేతులెత్తి మొక్కుతున్నా

  • క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి దాతలు ముందుకు రావాలి

  • క‌రోనా వైర‌స్ వ్యాప్తి, నిర్మూల‌న‌, తీసుకుంటున్న చ‌ర్య‌లు, మ‌క్క‌లు, ధాన్యం కొనుగోలు, బియ్యం పంపిణీ, వ‌ల‌స కార్మికుల‌ను ఆదుకోవడం, లాక్ డౌన్ నిర్వ‌హ‌ణ వంటి ప‌లు అంశాల మీద జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ లో క‌లెక్ట‌ర్, పోలీసు, వైద్యులు, వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్షించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

జ‌న‌గామ‌, ఏప్రిల్ 11: క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డిలో సీఎం కెసిఆర్ గారి ముందు చూపు, అంద‌రికంటే ముందుగానే విధించిన లాక్ డౌన్ నిర్ణ‌యం, ప్ర‌జ‌ల ప్రాణాల‌పై పెట్టిన శ్ర‌ద్ధ‌, తీసుకుంటున్న నిర్ణ‌యాల కార‌ణంగానే ఇవ్వాళ తెలంగాణ దేశానికే ఆద‌ర్శంగా నిలుస్తున్న‌ద‌ని, ప్ర‌జ‌లు కూడా చిత్త‌శుద్ధితో సిఎం కెసిఆర్ ఇచ్చిన సూచ‌న‌లు పాటిస్తున్నార‌ని, ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు, రైతాంగానికి అన్నివిధాలుగా స‌హ‌కారంగా నిలుస్తున్న‌ద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి, నిర్మూల‌న‌, తీసుకుంటున్న చ‌ర్య‌లు, మ‌క్క‌లు, ధాన్యం కొనుగోలు, బియ్యం పంపిణీ, వ‌ల‌స కార్మికుల‌ను ఆదుకోవడం, లాక్ డౌన్ నిర్వ‌హ‌ణ వంటి ప‌లు అంశాల మీద జ‌న‌గామ క‌లెక్ట‌రేట్ లో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డా.టి.రాజయ్య, క‌లెక్ట‌ర్ నిఖిల‌, పోలీసు, వైద్యులు, వివిధ శాఖ‌ల అధికారుల‌తో మంత్రి ద‌యాక‌ర్ రావు స‌మీక్షించారు. మంత్రికి అధికారులు తాము తీసుకుంటున్న చ‌ర్య‌లు వివ‌రంచ‌గా, మంత్రి వారికి మ‌రికొన్ని సూచ‌న‌లతో దిశానిర్దేశం చేశారు. అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు.

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వానికి సహాకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సిఎం కేసీ ఆర్ ముందు చూపు, దార్శ‌నిక‌త‌, ధైర్యంగా తీసుకున్న‌ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వైరస్ ను అరిక‌ట్ట‌డంలో ముందున్నామ‌న్నారు. అంద‌రికంటే ముందే లాక్ డౌన్ పెట్టి క‌రోనా వ్యాప్తిని నిలువ‌రించ‌గ‌లిగార‌ని, ఇక నిర్మూల‌న ఒక్క‌టే మ‌న‌ముందున్న‌ద‌ని మంత్రి తెలిపారు. క‌రోనా నిర్మూల‌న‌కు లాక్ డౌన్ త‌ప్ప మ‌రోదారి లేద‌ని, దీన్ని ప్ర‌జ‌లు గుర్తించి మ‌రింత‌గా స‌హ‌క‌రించాల‌ని ఎర్ర‌బెల్లి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.  

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా... జ‌న‌గామ జిల్లాలో...:


ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదృష్ట‌వ‌శాత్తు విదేశాల  నుండి వచ్చిన వారిలో కరోనా రాలేదు. దుర‌దృష్ట‌వ‌శాత్తు కేవ‌లం డిల్లీ మర్కజ్ కు వెళ్లివచ్చిన వారితో కరోనా వైరస్ వ్యాప్తి జరిగింది. మర్కజ్ పర్యటనకు వెళ్లిన వారందరినీ గుర్తించి క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. అని మంత్రి చెప్పారు. జనగామ జిల్లాలో మర్కజ్ పోయి వ‌చ్చిన 7గురిలో ఇద్దరికి పాజిటివ్ వ‌చ్చింద‌ని, వీళ్ళ‌తో క‌లిసిన వాళ్ళు 116 మంది... వీళ్ళంద‌రికీ నెగెటివ్ వ‌చ్చింది... అని మంత్రి వివ‌రించారు. జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్ పోలీసు అధికారులు, సిబ్బంది, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు అంతా ప్ర‌భుత్వ ఆదేశాల‌ను తు.చ త‌ప్ప‌కుండా పాటించారు. క‌రోనాని క‌ట్ట‌డి చేస్తున్నార‌ని మంత్రి అభినందించారు.

ఇక ప్ర‌భుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంద‌ని, జనగామ జిల్లాలో టెలి మెడిసిన్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ మార్కెట్ కు పాల్పడే వ్యపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. అని మంత్రి తెలిపారు.
 
ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో...ధాన్యం, మ‌క్క‌ల కొనుగోలు కేంద్రాలు:

రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 835 దాన్యం కొనుగోలు కేంద్రాలు, 265 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జ‌రిగింద‌ని, 6 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు, 10లక్షల 67వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాలతో పెరిగిన సాగుతో, అధిక దిగుబడులు వ‌చ్చాయ‌ని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, రైతులు ఆందోళనకు గురికావద్దని మంత్రి ఎర్ర‌బెల్లి భ‌రోసా ఇచ్చారు.

నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే... జ‌రిమానాలు త‌ప్ప‌వు.. దాతలు త‌మ ధాతృత్వాన్ని చాటుకోవాలి:

ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని, లేకపోతే భారీ జరిమానాలు విధించాల్సి వ‌స్తుంద‌ని, ప్రతి గ్రామంలో మాస్కులను అందుబాటులో ఉంచాలని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. మేరు సంఘాలు, మహిళా సంఘాల ద్యారా మాస్కుల తయారీ జ‌రుగుతున్న‌ద‌ని చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారపై కఠిన చర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని, వారి ధాతృత్వాన్ని చాటుకోవాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు.


More Press News