8 లక్షల రూపాయల విలువైన కూరగాయల పంపిణీ చేసిన ఏపీ మంత్రి వెలంపల్లి

  • కూరగాయల పంపిణీ ప్రారంభించి ఇప్పటి వరకు 51 వేల మందికి పంపిణీ 
  • కాకరపర్తి భావనారాయణ కళాశాల కేంద్రముగా కూరగాయల పంపిణీ
  • జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించిన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: ప్రజలు ఇబ్బంది పడకూడదనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయ లక్ష్యంలో భాగంగా లాక్ డౌన్ నేపథ్యంలో పేద కుటుంబాలకు ఆదుకోవాలని ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలోని ఈరోజు 8 లక్షల రూపాయల విలువైన కూరగాయలు, ప్రజలకు ప్రతిరోజు కూరగాయల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 51 వేల మందికి కూరగాయలను పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల కేంద్రముగా కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జెండా ఊపి ప్రారంభించారు.

చాంబర్ ఆఫ్ కామర్స్, కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్, ది. విజయవాడ ఐరన్ అండ్ హార్డ్వేర్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు సంయుక్తంగా కూరగాయలు పంపిణీకి వితరణ చేశారు. కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వారిలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర రావు, కొండపల్లి మురళి (బుజ్జి), ఆదిత్య, తుని గుంట్ల శ్రీనివాస తదితరులు ఉన్నారు.

More Press News