ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం సింగరాజు పల్లె, పాలకుర్తి మండలం విస్నూరు, చెన్నూరు, కొడకండ్ల తదితర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి దిగుబడులు తెలుసుకొని, రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పిన మంత్రి రైతులకు, ప్రజలకు భరోసా కల్పిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి నేపద్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, మాస్కులు పంపిణీ చేస్తూ, సామాజిక, భౌతిక దూరం పాటించాలని చెబుతూ, పాటిస్తూ, మంత్రి ఎర్రబెల్లి నియోజకవర్గంలో పర్యటించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్:

  • కేంద్రం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి

  • ఆర్థిక మాంద్యంతో పాటు కరోనా సమస్యలు చుట్టుముట్టిన ప్పటికి, అటు ప్రధాని, ఇటు సీఎం కెసిఆర్ గారు ప్రజలను ఆదుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు

  • ఇప్పటికే కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నీళ్ళు పుష్కలంగా అందాయి

  • దీంతో  పంటలు బాగా పండాయి. మంచి దిగుబడులు వచ్చాయి

  • దురదృష్ట వశాత్తూ...  కరోనా వైరస్ వ్యాప్తి చెందింది

  • అయినా సరే, దేశంలో ఎక్కడా లేని విధంగా, రైతులు ఇబ్బందులు పడకూడదని సీఎం కెసిఆర్ గారు, ప్రతి ధాన్యం, మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు

  • రైతు కు గిట్టుబాటు ధర లభించే విధంగా రైతు సమన్వయ కర్తలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లు, అధికారులు కలిసి గ్రామ స్థాయిల్లో కమిటీలు వేయండి

  • ఆ కమిటీల సాయంతో, రైతులకు ఇబ్బందులు రాకుండా టోకెన్లు ఇవ్వండి

  • టోకెన్లు ప్రకారం రైతుల ధాన్యం కొనుగోలు జరిగేలా చూడండి

  • గిడ్డంగుల, బ్యాగుల, తూ కాల సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలి

  • సీఎం కెసిఆర్ గారు, ఇతర రాష్ట్రాల నుండి బ్యాగుల తెప్పిస్తున్నరు

  • రైతాంగం కోసం కెసిఆర్ పడుతున్న శ్రమని వృధా చేయవద్దు

  • కరోనా తో దేశదేశాల ప్రజలు తీవ్ర సమస్యల్లో ఉన్నారు

  • కరోనా బాధితులను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు

  • అందుకే మన సీఎం గారు చెప్పినట్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలి

  • పట్టణాలు నగరాల నుంచి వచ్చిన వాళ్ళను శత్రువుల్లా చూడవద్దు

  • బతుకుతెరువు కోసం వెళ్లి వస్తున్న వాళ్ళు కూడా మన వాళ్ళే

  • వాళ్ళు అనుమానం వస్తే పరీక్షలు చేయిచుకోవాలి

  • ఈ దశలో నిరుపేదలను ఆదుకోవాలి

  • నాయకులు ఇప్పుడు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి

  • ప్రజల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. నిజమైన నాయకులుగా గుర్తింపు తెచ్చుకోవాలి

  • వైద్యులు, పోలీస్ లు, పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు తమ ప్రాణాలను తెగించి పని చేస్తున్నారు,  వాళ్ళందరికీ అభినందనలు, ప్రజలందరూ క్షేమంగా ఉండాలన్నదే సీఎం కెసిఆర్ గారు, ప్రధాని మోడీ లక్ష్యం, మన సంస్కృతి గొప్పది. దాన్ని పరిరక్షించుకుందాం

  • ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు


More Press News