కరోనా నిర్మూలన జరిగే వరకు సీఎం కేసీఆర్ కి సహకరిద్దాం: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ గొప్ప మానవతా వాది
కరోనా కష్ట కాలంలోనూ ప్రజల క్షేమం, పేదల సంక్షేమం మరవని సిఎం కెసిఆర్
రేషన్ కార్డున్న వాళ్ళకి 12కిలోల బియ్యం, రూ.1500 అందిస్తున్నారు
వలస కూలీలను సైతం సొంత బిడ్డల్లా చూస్తున్నారు
రైతులు పండించిన ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
కరోనా బాధితులకు పూర్తి అండగా ఉన్నారు
ప్రజలు చేయాల్సిందల్లా... లాక్ డౌన్ ని పాటించడమే
కరోనా నిర్మూలన జరిగే వరకు సిఎం కెసిఆర్ కి సహకరిద్దాం
ఈ కష్ట కాలంలో ముందుకు వస్తున్న దాతలకు ధన్యవాదాలు
ఎన్ ఆర్ ఐ లు సొంత ఊళ్ళకు వెన్నుదన్నుగా నిలవాలి
దాతలు, ఎన్ఆర్ఐలకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపు
ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA USA), అనుమాండ్ల రాజేందర్ రెడ్ది- ఝాన్సీల సౌజన్యంతో తొర్రూరులో వలస కూలీలకు రూ.3.5 లక్షల విలువైన బియ్యం పంపిణీ
అనుమాండ్ల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భోజన కిట్ల పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
తొర్రూరు (మహబూబాబాద్ జిల్లా), ఏప్రిల్ 4: 'మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గొప్ప మానవతావాది. కరోనా కష్ట కాలంలోనూ నిరుపేదల సంక్షేమాన్ని, ప్రజల క్షేమాన్ని మరవలేదు. రేషన్ కార్డున్న వాళ్ళందరికీ 12కిలోల బియ్యం, రూ.1500 అందిస్తున్నారు. వలస కూలీలను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. రైతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కరోనా బాధితులకు అండగా ఉంటున్నారు. దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా మన సీఎం నిలుస్తున్నారు. మనం చేయాల్సిందల్లా సిఎం గారికి సహకరించడమే'నని, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
ఈ కష్ట కాలంలో ముందుకు వస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్ ఆర్ ఐ లు కూడా ధాతృత్వాన్ని చాటుకోవాలి. తమ సొంత ఊళ్ళకు వెన్నుదన్నుగా నిలవాలి. అని మంత్రి దాతలు, ఎన్ ఆర్ ఐలకు కూడా పిలుపునిచ్చారు. ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA-USA), అనుమాండ్ల రాజేందర్ రెడ్ది- ఝాన్సీల సౌజన్యంతో తొర్రూరులో వలస కూలీలకు రూ.3.5 లక్షల విలువైన 300 రోజులకు సరిపడా బియ్యాన్ని మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు. అలాగే అనుమాండ్ల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భోజన కిట్లను మంత్రి దయాకర్ రావు పంపిణీ చేశారు.
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ప్రపంచమంతా అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదర్కొంటున్న ఈ కష్ట కాలంలోనూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రజల క్షేమాన్ని, నిరుపేదల సంక్షేమాన్ని మరవలేదన్నారు. అలాగే, వసల కూలీలను సొంత బిడ్డల్లా చూసుకుంటూ, అసలైన మానవతావాదిగా నిరూపించారని చెప్పారు.
రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసే బాధ్యతని సిఎం తీసుకున్నారని, ఈ విధంగా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ, ప్రభుత్వాలు చేయలేదని చెప్పారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కోసం 30 వేల కోట్లను, మక్కల కొనుగోలుకు 3వేల కోట్లని సిద్ధం చేశారని చెప్పారు. రాష్ట్రమంతటా కొనుగోలు కేంద్రాలు మొదలయ్యాయని చెప్పారు.
దేశమంతా లాక్ డౌన్ నిర్వహిస్తున్న ఈ సమయంలో అమెరికాలోని ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA-USA), అనుమాండ్ల రాజేందర్ రెడ్ది- ఝాన్సీల సౌజన్యంతో తొర్రూరులో వలస కూలీలకు రూ.3.5 లక్షల విలువైన బియ్యం ఇవ్వడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. అలాగే అనుమాండ్ల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భోజన కిట్ల పంపిణీ చేయడాన్ని మంత్రి స్వాగతించారు. ఇక ఈ ఆపత్కాలంలో దాతలు ముందుకు వచ్చి తమ ధాతృత్వాన్ని చాటుకోవాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. నిరుపేదలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న దాతలని మంత్రి అభినందించారు.
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మాస్కులు, బియ్యం పంపిణీ:
తొర్రూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు రూ.20 వేల విలువైన మాస్కులు, అనాథలకు క్వింటా బియ్యాన్ని మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్ ఆర్ ఐలు రాజేందర్ రెడ్డి, అనుమాండ్ల తిరుపతి రెడ్డి, అధికారులు, వలస కూలీలు, అనాథలు పాల్గొన్నారు.