కరోనా కట్టడిలో అందరూ సహకరించాలి: తెలంగాణ మంత్రి సత్యవతి
•లాక్ డౌన్ లో అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకు రావద్దు
•లాక్ డౌన్ సమయంలో ఎవరికీ ఇబ్బందులు లేకుండా సిఎం చూస్తున్నారు
•ఈ రాష్రంలో ఎవరూ ఆకలితో ఉండొద్దన్న సంకల్పానికి అందరూ చేయుతనివ్వాలి
•స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలి
•వీధిబాలలు, వలస కూలీలకు దుస్తుల పంపిణీలో...తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని వర్గాల వారు సహకరిస్తున్న నేపథ్యంలో వలస కూలీలు, వీధి బాలలు, దినసరి కూలీల వంటి వారిని ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు.
ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సిఎం కేసిఆర్ సంకల్పానికి అందరూ బాసటగా నిలవాలని కోరారు.