ప్రజలు అందరూ సహకరిస్తున్నారు: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ
తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఈ రోజు ఎల్బీనగర్, చైతన్య పురి, దిల్ సుఖ్ నగర్ పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా పరిశీలించారు.
అనంతరం హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ ఎల్బీ నగర్ సీపీ క్యాంప్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు అందరూ సహకరిస్తున్నారని అన్నారు.
తెలంగాణలో 1500 రూపాయలు రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్నాం
రేట్లు ఎక్కువ చేసి అమ్మితే వారిపై కేసులు పెడతాం
రాచకొండ కమిషనర్ కార్యాలయం విస్తీర్ణం పెద్దదిగా ఉంది
42లక్షల పాపులేషన్ 58 పోలీసు స్టేషన్లు
కరోనా వైరస్ చాలా భయంకరమైన వ్యాధి
అలాగే చాలా స్లోగా పెరుగుతూ వస్తుంది
ప్రజలెవరూ బయటకు రావద్దు
కూరగాయలను సరఫరా చేయడంలో ఎవరు అడ్డుకోవడం లేదు
కూరగాయలు, నిత్య అవసరాలు సరుకులను మార్కెట్ లకు సరఫరా చేసేందుకు వచ్చే లారీలను అనుమతి ఇస్తున్నాము
తెలంగాణ పోలీసుల పై చాలా గౌరవం ఉంది
తెలంగాణ పోలీసులు ప్రజలను కట్టడి చేస్తున్నారు. అలాగే వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు
నిత్యావసర సరుకులను కొనుగోలు చేసేవారు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి
ప్రధానంగా యువత రోడ్డు పైకి రాకూడదు
మార్చి 31 వరకు లాక్ డౌన్ ఉంది.. పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో పరిశీలించిన హోంమంత్రి
- ప్రజల వద్ద ఎలాంటి సమాచారం ఉన్న రాచకొండ వాట్సప్ నెంబర్ కు కాని డయల్ 100 కు కాల్ చేయండి
ప్రైవేటు వాహనాల్లో ప్రయాణీకుల తరలింపు మా దృష్టికి వచ్చింది.. వారి పై చర్యలు తీసుకుంటాం
కరోనా తగ్గిపోతుంది అనుకున్న సమయంలో మళ్లీ ఒక్కసారిగా పెరుగుతుంది... రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్