పోలీసులు జర్నలిస్టులను అడ్డుకోరాదు: అల్లం నారాయణ విజ్ఞప్తి

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జర్నలిస్టులు అత్యవసర సేవల విభాగంలోకి వస్తారు కనుక పోలీసులు జర్నలిస్టులను అడ్డుకోరాదని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ విజ్ఞప్తి చేశారు. 

కరొనా వైరస్ గురించి కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు ,పోలీసులు, డాక్టర్లు తీసుకుంటున్న చర్యలు గురించి గాని తెలియాలంటే మీడియా అత్యవసరమని, అందువల్ల పోలీసులు మీడియా పట్ల భాధ్యతగా వ్యవహరించాలని పోలీసులకు సూచించారు.

ఈ సంక్లిష్ట సందర్భంలో కరోనా వైరస్ ను అరికట్టేందుకు మీడియా, పోలీసులు, వైద్యులు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో కలసి పని చేయాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, హోమ్ మంత్రి మహమ్మూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలు ఇందుకు తగిన వాతావరణం కల్పించడానికి ప్రయత్నించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


More Press News