తెలంగాణ ఎన్నో అవ‌రోధాల‌ను అధిగ‌మించింది: మంత్రి నిరంజన్ రెడ్డి

  • ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారి దూర‌దృష్టి మూలంగా స‌వాళ్ల‌ను ఎదుర్కోగ‌లిగాం
  • గ్రామీణ వ్య‌వ‌స్థ బ‌లోపేతం చేయ‌డంకోసం అనేక చ‌ర్య‌లు చేప‌ట్టాం
  • 60 శాతం జ‌నాభా ఉన్న, వ్య‌వ‌సాయం మీద ఆధార‌ప‌డ్డ‌ గ్రామీణ ప్రాంతాలు నిల‌దొక్కుకోవాల‌న్న‌దే ల‌క్ష్యంగా భావించాం
  • మిష‌న్ కాక‌తీయ‌తో 46 వేల చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌
  • దీంతో ఈ చెరువుల‌ ప‌రిధిలోని వ్య‌వ‌సాయ ఆధారిత ప్ర‌జ‌ల‌కు 78 శాతం ఆదాయం అద‌నంగా పెరిగింది
  • చెరువుల‌లో ఉచితంగా చేప‌పిల్ల‌లు విడుద‌ల చేయ‌డం మూలంగా మ‌త్య్స‌కారుల ఆదాయం 35 శాతం పెరిగింది
  • 265 టీఎంసీల నీటి నిలువ సామ‌ర్ధ్యాన్ని చెరువుల ద్వారా పున‌రుద్దురించుకున్నాం
  • మిష‌న్ భ‌గీర‌ధ‌తో రూ.43,791 కోట్ల వ్య‌యంతో 2.32 కోట్ల జ‌నాభా ఉన్న 20.60 ల‌క్ష‌ల‌ ఆవాసాల‌కు శుద్ద‌జ‌లం తాగునీరు అందించే ప‌థ‌కాన్ని మొద‌లుపెట్టి పూర్తి చేశాం
  • రాష్ట్రంలోని 58.33 ల‌క్ష‌ల రైతులకు 1.43 కోట్ల ఎక‌రాల సాగుభూమి ఉన్న‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించింది
  • వీరంద‌రికీ రైతుబంధు ప‌థ‌కం అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంది. ఏడాదికి రెండు సార్లు వారికి పంట పెట్టుబ‌డి కింద ప్ర‌భుత్వ సాయం అందుతుంది
  • తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌పంచ విత్త‌న‌కేంద్రంగా మార్చేందుకు ప్ర‌భుత్వం కృషిచేస్తుంది
  • ప్ర‌తిష్టాత్మ‌క ఇస్టా 32వ స‌ద‌స్సు తొలిసారి ఆసియాలో అదీ తెలంగాణ‌లో నిర్వ‌హించుకోవ‌డం జ‌రిగింది
  • ఈ స‌ద‌స్సు విజ‌య‌వంతం కావ‌డంతో తెలంగాణ ప్ర‌తిష్ట మ‌రింత పెరిగింది - ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన‌ కాళేశ్వ‌రం ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఓ ఇంజ‌నీరింగ్ అద్భుతం
  • రూ.80 వేల కోట్ల‌తో నిర్మించిన ఈ ప్రాజెక్టు ముఖ్య‌మంత్రి కేసీఆర్ దృఢ‌నిశ్చ‌యంతో కేవ‌లం మూడేళ్ల‌లో పూర్త‌యింది
  • ప్ర‌పంచంలోనే ఎవ‌రూ చేప‌ట్ట‌ని విధంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు రైతుభీమా ప‌థ‌కం చేప‌ట్టారు
  • ప్ర‌భుత్వమే భీమా చెల్లించి మ‌ర‌ణించిన రైతు కుటుంబానికి రూ.5 ల‌క్ష‌లు ఇవ్వ‌డం ఆ కుటుంబాల‌కు గొప్ప ఊర‌ట‌
  • రైతులు, ప్ర‌భుత్వం, బ్యాంకుల‌ను అనుసంధానం చేసే సంస్థ నాబార్డు
  • వ్య‌వ‌సాయ రంగానికి నాబార్డు సేవ‌లు ప్ర‌శంస‌నీయం
  • రైతుల‌కు రుణాలిచ్చి అండ‌గా నిల‌వబ‌డుతుంది
  • మిష‌న్ భ‌గీర‌ధ‌కు రూ.4800 కోట్లు, కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు ఇచ్చినందుకు నాబార్డుకు ధ‌న్య‌వాదాలు
  • తెలంగాణ‌ సంక్షేమ, అభివృద్ది ప‌థ‌కాల‌కు నాబార్డు అందిస్తున్న సాయం మ‌ర‌వ‌లేనింది
  • భ‌విష్య‌త్ లో ఈ స‌హ‌కారాన్ని కొన‌సాగించాలి
  • నాబార్ఢు 38 వార్షికోత్స‌వ స‌మావేశంలో రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి
  • పాల్గొన్న ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈఓ ఫకీర్ సామి, రిజర్వ్ బ్యాంక్ రీజనల్ డైరెక్టర్ సుబ్రతా దాస్, నాబార్డ్ ఫార్మర్ చైర్మన్ కోటయ్య, ఏపీ నాబార్డ్ సీజీఎం సెల్వరాజ్, నాబార్డ్ తెలంగాణ సీజీఎం విజయ్ కుమార్ తదితరులు

More Press News