చేతి వృత్తులకు ప్రభుత్వం చేయూత - ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్
ఈ రోజు మేడ్చల్ జిల్లా బొరంపేట్ గ్రామంలో గల కుమ్మరి బస్తీని సందర్శించి వారి జీవన విధానాలు, వృత్తి పరమైన సమస్యలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కార్పొరేషన్ సీఈఓ ఆలోక్ కుమార్.
తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మొదటగా బొరంపేట్ గ్రామంలోని కుమ్మరి బస్తీలో అనేక కుటుంబాలు తమ చేతి వృత్తిని ఆధారంగా చేసుకొని అందరూ కలసి డిమాండ్ కు తగ్గ ఉత్పత్తిని సాదించడంతో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. దీనికి ఆధునీకరణ తోడైతే వీరి ఉత్పత్తులని దేశ వ్యాప్తంగా విస్తరించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశం అభివృద్ది పథంలో పరుగులు పెడుతున్న గత పాలకుల నిర్లక్ష ధోరణి, వృత్తి కులాలను ఆదరించకపోవడం వలన ఎన్నో కుటుంబాలు వందల ఏళ్లుగా వస్తున్న పద్ధతుల ద్వారానే తమ వృత్తిని కొనసాగిస్తూ అనారోగ్యంపాలు అవుతున్నారన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వృత్తి కులాల పట్ల ప్రత్యేక చొరవ తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేపట్టి చేయుతను అందిస్తున్నారన్నారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో వృత్తి కులాల వారు ఆధునిక యంత్రాల ద్వారా ఉత్పత్తిని చేస్తున్నారు అని, ఆ మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక యంత్రాలను సబ్సిడీ ద్వారా వృత్తిదారులకు అందించడంతో పాటు నైపుణ్య శిక్షణ కూడా ఇప్పించే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రస్తుతం మట్టి పాత్రలకు గాని మట్టి వినాయకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడటం వల్ల డిమాండుకు తగిన ఉత్పత్తికి పాత పద్దతుల ద్వారా సాధ్యం కావడం లేదని ప్రత్యన్మయంగా ఆధునిక యంత్రాలను అందించాలని ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. ఇలా వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి కులానికి ప్రభుత్వం తప్పక చేయుతను అందిస్తుందని వివారించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు జయంత్ రావు, బాలకృష్ణ, మేడ్చల్ జిల్లా నాయకులు వీరేశం, శ్రీనివాస్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.