పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం: పట్టణాల రూపు మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు నేటి నుండి మార్చ్ 4వ తేదీ వరకు చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమంను ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ మాణిక్య నగర్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. డివిజన్లలో మురికి కాలువలు పూడిక తొలగించి, మొక్కలు నాటారు. గృహ సముదాయాల మధ్య ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మ్ లు తొలగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. లూజ్ వైర్లు సరిచేసి రద్దుకు అడ్డుగా ఉన్న స్తంభాలు తొలగించాలన్నారు.
అనంతరం సైకిల్ ఎక్కి చెరువు బజార్, జమ్మిబండ, వైరా రోడ్డు, బస్ స్టాండ్ సెంటర్, రైతు బజార్, ఆర్డీఓ కార్యాలయం, ట్రాఫిక్ స్టేషన్ ఆవరణం, టిటీడి కల్యాణ మండపం, నిరుపయోగంగా ఉన్న అటవీ శాఖ భవనం తదితర ప్రాంతాల్లో తిరిగి అక్కడ నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి IAS కు ఆదేశించారు. వారి వెంట జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, R&B EE శ్యామ్ ప్రసాద్, విద్యుత్ SE రమేష్, DM&HO మాలతి, DEO మదన్ మోహన్, RDO, అటవీ శాఖ అధికారులు మున్సిపల్ DEలు సిబ్బంది ఉన్నారు.