అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తెలంగాణ అటవీ శాఖ చర్యలు

  • ఇటీవల అటవీ ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాల దృష్ట్యా ప్రత్యేక ఆదేశాలు. (జరిగిన మూడు ప్రమాదాలకు కూడా మానవ నిర్లక్ష్యం వల్ల అని విచారణలో తేలింది.

  • రక్షిత అటవీ ప్రాంతాల్లో ప్రవేశంపై ఆంక్షలు. నల్లమల గుండా శ్రీశైలం వెళ్లే భక్తులు అటవీ శాఖ సూచనలు తప్పకుండా పాటించాలి.

  • అడవిలో నిర్దేశించిన ప్రాంతాలు, రోడ్ల ద్వారానే ప్రయాణించాలి, అటవీ మార్గాల్లో కాలి బాటల్లో ప్రయాణంపై నిషేధం.

  • ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విరామ ప్రాంతాల్లో సేద తీరేందుకు అనుమతి.

  • అక్కడ తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్న అటవీ శాఖ.

  • అడవిలో నిప్పు రాజేయటం, వంటలపై నిషేధం.

  • అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలతో పాటు, రక్షిత అటవీ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్. 


More Press News