ఆదిత్య ఓం ‘బంధీ’

ఆదిత్య ఓం నటించిన బంధీ అనే సినిమా రిలీజ్‌కు సిద్దం అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

సింగిల్ క్యారెక్టర్‌తో బంధీ అనే చిత్రాన్ని చేశారు ఆదిత్య ఓం. గల్లీ సినిమా బ్యానర్ మీద ఈ మూవీని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మించగా.. తిరుమల రఘు దర్శకత్వం వహించారు. పర్యావరణ సంరక్షణ, ప్రకృతి గొప్పదనం చాటి చెప్పేలా ఈ మూవీ ఉండబోతోంది. ఇది వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పోస్టర్లు, ట్రైలర్ సినిమాలోని డెప్త్‌ను చాటాయి. ఇక ఈ మూవీ ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది.

నేచురల్ లొకేషన్స్‌లో ఈ మూవీని షూట్ చేశారు. దేశంలోని వివిద అటవీ ప్రాంతాల్లో కష్టాలు పడుతూ, ఎటు వంటి డూప్స్ లేకుండా ఆదిత్య ఓం చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు హైలెట్ కానున్నాయి. ప్రకృతిని నాశనం చేస్తున్న మానవాళికి ఓ కనువిప్పులా ఈ చిత్రం ఉండబోతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ముందుకు మేకర్లు తీసుకు రానున్నారు.



More Press News