నరుడి బ్రతుకు నటన అనే టైటిల్‌ ఫస్ట్‌ డీజే టిల్లు సినిమాకు పెట్టారు: హీరో శివకుమార్‌

శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’.  ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టిజి విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. సుధీర్ కుమార్ ప్రాజెక్ట్ హెడ్ గా ఉన్నారు. ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా ఈ నెల 25న థియెట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరోలు శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న మీడియాతో మాట్లాడారు. 

 హీరో శివకుమార్ రామచంద్రవరపు మాట్లాడుతూ ''  ఈ చిత్రంలో సత్య అనే క్యారెక్టర్ లో నటించాను. సత్య డబ్బున్న కుటుంబంలో పుట్టిన యువకుడు. తండ్రి పోషణలో సకల సౌకర్యాలతో హాయిగా బతుకుతుంటాడు. తనకు నటుడు కావాలనే కోరిక. అలాంటి సంపన్న కుటుంబంలోని యువకుడు అనుకోకుండా కేరళలోని ఓ తెలియని ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎలా జీవనం సాగించాడు. అతనికి తోడుగా ఎవరు నిలిచారు అనేది ‘నరుడి బ్రతుకు నటన’ సినిమా కథ. నరుడి బ్రతుకు నటన’ సినిమా నాకు హీరోగా మంచి పేరు తెస్తుంది. 

మజిలీ, వకీల్ సాబ్, భజే వాయువేగం వంటి చిత్రాలతో మంచి పేరు వచ్చింది. అయితే లీడ్ రోల్ లో సినిమా చేసే అవకాశం రావడం, ఆ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి సంస్థలో చేయడం హ్యాపీగా ఉంది. మనం కష్టపడి పట్టుదలగా ఉంటే సినిమా పరిశ్రమలో తప్పకుండా గుర్తింపు వస్తుందని తెలుసుకున్నాను. నరుడి బ్రతుకు నటన’ సినిమాకు ఫస్ట్ అనుకున్న టైటిల్ నటసామ్రాట్. అయితే ఆ టైటిల్ మాకు దొరకలేదు. అదే టైటిల్ తో ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రివ్యూస్ వేశాం. ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్ ఫస్ట్ డీజే టిల్లుకు అనుకున్నారు. 

ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో మా సినిమాకు దాదాపు 60 అవార్డ్స్ వచ్చాయి. వాటిలో దాదా సాహెబ్ ఫాల్కే జ్యూరీ అవార్డ్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా చూసిన తరువాత థియేటర్స్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి ఎమోషన్ తో బయటకు వస్తారు' అన్నారు. 

 హీరో నితిన్ ప్రసన్న మాట్లాడుతూ ''నేను అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా తర్వాత చేస్తున్న చిత్రమిది. ‘నరుడి బ్రతుకు నటన’ స్క్రిప్ట్ దర్శకుడు రిషికేశ్వర్ చెప్పగానే హార్ట్ టచింగ్ గా అనిపించింది. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలో నేను నెగిటివ్ రోల్ చేశాను కానీ ఈ సినిమాలో కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను. ‘నరుడి బ్రతుకు నటన’ మూవీలో నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది.

‘నరుడి బ్రతుకు నటన’ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మనుషులు ఇలా ఉంటే మన సమాజం ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే మన లైఫ్ లో ఇలాంటి స్నేహితుడు ఉండాలని కోరుకుంటారు. హ్యూమన్ ఎమోషన్స్ గురించి హార్ట్ టచింగ్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు  

కొంత మేరకు  నాని పిల్ల జమీందార్ సినిమాకు మా ‘నరుడి బ్రతుకు నటన’తో కొంత పోలిక ఉండొచ్చు కానీ మూవీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. నేను తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నాను. మంచి ఆఫర్స్ వస్తున్నాయి. నటుడిగా మీ ఆదరణ మరింతగా పొందుతానని కోరుతున్నాను. 

ఈ సినిమాను థియేటర్ లో చూడండి. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ కోసమే స్పెషల్ గా సౌండ్ డిజైన్ చేయించాం. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న మా ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాను చూసి తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నా'' అన్నారు. 

More Press News