సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా 'శంబాల'

ఆది సాయికుమార్‌ నటిస్తున్న నూతన చిత్రం 'శంబాల'. ఆనంది హీరోయిన్‌. యుగంధర్‌ దర్శకుడు. రాజశేఖర్‌ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి. చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సూపర్‌ నేచురల్ హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. టైటిల్ పోస్టర్‌లో ఒక్క మనిషి కూడా లేని గ్రామం, ప్రళయానికి ముందు భీకరంగా ఉన్న ఆకాశం, మబ్బుల్లో ఓ రాక్షస ముఖం ఇవన్నీ చూస్తుంటే 'శంబాల' కథ లో  థ్రిల్స్‌ చేసే హారర్‌ అంశాలు వున్నట్లుగా తెలుస్తోంది. 

నిర్మాతలు మాట్లాడుతూ 'ఇదొక డిఫరెంట్‌ జానర్‌లో రూపొందుతున్న ఇంట్రెస్టింగ్‌ ఫిల్మ్‌. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ఇంత వరకు టచ్‌ చేయని డిఫరెంట్ స్టోరీ లైన్‌ను చూపించబోతున్నాం. టెక్నికల్‌గా కూడా చాలా ఉన్నతంగా వుండబోతుంది. డ్యూన్, ఇన్సెప్షన్, బ్యాట్ మ్యాన్, డన్ కిర్క్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అయిన హాన్స్‌ జిమ్మర్‌ లాంటి లెజెండరీ హాలీవుడ్ కంపోజర్స్‌తో కలిసి వర్క్ చేసిన ఇండియన్ మ్యూజీషియన్‌ శ్రీరామ్‌ మద్దూరి ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు.  బ్యాక్‌గ్రౌండ్స్ స్కోర్స్ విషయంలోనూ ఇంతకు ముందు ఏ  సినిమాలో ఎక్స్‌పీరియన్స్ చేయని కొత్త సౌండింగ్‌ను ఈ సినిమాలో ఎక్స్‌పీరియన్స్‌ చెయ్యబోతున్నారు' అని తెలిపారు

More Press News