అభినవ్ వాసుదేవ్ అనే పోస్ట్‌ మ్యాన్‌ జీవితంలో జరిగే 'క'థ ఇది!

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్  సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి  నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. "క" సినిమాను తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, మలయాళంలో హీరో దుల్కర్ సల్మాన్ తన వేఫరర్ ఫిలింస్ పై రిలీజ్ చేయబోతున్నారు. ఈ రోజు ‌"క" సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - "క" సినిమాను ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్ణయించాం. ఆ రోజు చాలా సినిమాలు రిలీజ్ కు వస్తున్నాయి. థియేటర్స్ దగ్గర పోటీ ఉంది. మేము ఈ నెల 31న రిలీజ్ చేయడానికి కారణం మా వంశీ నందిపాటి. ఆయన మూవీ చూసి మంచి ప్రైస్ ఇచ్చి సినిమా రిలీజ్ చేస్తున్నారు. మా అందరికీ "క" సినిమాపై సినిమాపై నమ్మకం ఉంది. ఈ రోజు ఆడియెన్స్ చాలా ఎంపికగా థియేటర్స్ కు వెళ్తున్నారు. కంటెంట్ నచ్చితేనే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. మా మూవీ టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏదో కొత్త కంటెంట్ మూవీలో ఉండబోతోంది అనే వైబ్ క్రియేట్ అయ్యింది. కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి "క" సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. తమిళంలో సహా అన్ని భాషల్లో ఈ నెల 31నే రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నాం. "క" సినిమా 70వ దశకం నేపథ్యంతో పీరియాడిక్ కథతో సాగుతుంది. కాబట్టి యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులు, మీ ఇంట్లోని పెద్ద వాళ్లను కూడా ఆకర్షించే అంశాలుంటాయి. "క" సినిమా ఫస్ట్ డే షూట్ కు మా లొకేషన్ కు అల్లు అర్జున్ వచ్చి కిరణ్..ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలని విషెస్‌ అందించారు. అల్లు అర్జున్ గారి రావడం మాకు ఎంతో హ్యాపీగా అనిపించింది' అన్నారు.


డైరెక్టర్ సుజీత్ మాట్లాడుతూ - 70 దశకం నేపథ్యంలో "క" సినిమా సాగుతుంది. అప్పట్లో మనకు సమాచారం ఇచ్చేది పోస్ట్ మ్యాన్. ఆ కాలంలో అభినవ్ వాసుదేవ్ అనే ఓ పోస్ట్ మ్యాన్ జీవితంలో జరిగే కథ ఇది. ఒక ప్రత్యేకమైన హాబీ ఉన్న ఆ పోస్ట్ మ్యాన్ ఆ హ్యాబిట్ కోసం ఏం చేశాడు. ఆ ఊరికి ఎందుకు వెళ్లాల్సివచ్చింది. అక్కడ అతను ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి అనేది ఈ మూవీలో ఆసక్తికరంగా చూపించాం. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ ఉంది. "క" సినిమా ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్లేతో సాగుతుంది. మేము కథ చెప్పినప్పటి నుంచి కిరణ్ గారు ఈ క్యారెక్టర్ కోసం బాగా సన్నద్ధమయ్యారు. మీరు థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు అభినయ వాసుదేవ్ మాత్రమే కనిపిస్తారు. కిరణ్ అబ్బవరం అని అనుకోరు. అంతగా క్యారెక్టర్ లోకి మారిపోయారు కిరణ్ గారు. అన్నారు.

ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ - మా "క" సినిమాను ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నాం. మూవీ కంటెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా "క" సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది. కంటెంట్ బాగున్న సినిమాను ఎంత కాంపిటేషన్ లో అయినా ప్రేక్షకులు చూస్తారు. ఈ నెల 30నే ప్రీమియర్స్ వేయబోతున్నాం. పండుగకు నాలుగు రోజులు సెలవులు వస్తుండటం అడ్వాంటేజ్ అనుకుంటున్నాం. ఈ సినిమా నేను తీసుకునేందుకు కారణం కిరణ్ అబ్బవరం. సినిమా డిస్ట్రిబ్యూషన్ కోసం ఎంతో పోటీ ఉన్నా, కిరణ్ నాకే రైట్స్ ఇప్పించాడు. "క" సినిమా కంటెంట్ చూశాక నేను ఇచ్చింది తక్కువేనని అనిపించింది. ఈ నెల 31న మిగతా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. వారి మూవీస్ కూడా హిట్ కావాలి. మా సినిమా కూడా విజయం సాధించాలి. మేమంతా ఒకటే సినిమా కుటుంబంగా భావిస్తా. అన్నారు.

More Press News