మెడికల్‌ స్టూడెంట్‌ లైఫ్‌లో జరిగిన కథతో "ఘటికాచలం"

నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా "ఘటికాచలం". అమర్‌ దర్శకుడు. ఎం.సి.రాజు నిర్మాత. ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్నినిర్మాత ఎస్‌కేఎన్‌, దర్శకుడు మారుతి విడుదల చేస్తున్నారు. సోమవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 

డైరెక్టర్ అమర్ కామెపల్లి మాట్లాడుతూ - ఈ సినిమా కాన్సెప్ట్ ను యూఎస్ లో ఉండే నా ఫ్రెండ్ రాజు చెప్పాడు. వాళ్లకు తెలిసిన వారి ఇంట్లో జరిగే కొన్ని ఘటనలు చెప్పాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.  19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్ లో జరిగిన కథ ఇది. రాజు మనమే ఈ మూవీ చేద్దామని చెప్పారు. అలా ఘటికాచలం సినిమా మొదలైంది. మారుతి గారికి ట్రైలర్ చూపించాను. ఆయనకు నచ్చి మారుతి,ఎస్‌కేఎన్‌లు సినిమా చూశారు.  వాళ్లు  ప్రాజెక్ట్‌ను టేకప్‌ చేసి ఈ సినిమా విడుదల చేస్తున్నారు. మా టీజర్‌, ట్రైలర్‌ నచ్చితేనే మా సినిమా చూడండి అన్నారు. 

రైటర్ డార్లింగ్ స్వామి మాట్లాడుతూ  - డైరెక్టర్ అమర్ నాకు 20 ఏళ్లుగా  మిత్రుడు. ఘటికాచలం సినిమా ట్రైలర్ మారుతి గారు  చూసి అమర్ గారికి సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇస్తా అన్నారు. ఈమూవీ చూశాక సినిమా రిలీజ్ చేసేందుకు ఎస్కేఎన్, మారుతి గారు రిలీజ్  చేస్తామని ముందుుకు వచ్చారు. ఈ సినిమా హిట్ అయ్యి అమర్ , నిఖిల్ కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ - అమర్ గారు ఎంత ఇంటెన్స్ గా స్టోరీ నెరేట్ చేశారో దాన్ని నా పర్ ఫార్మెన్స్ లో చూపించానని అనుకుంటున్నాను. ఘటికాచలం సినిమా ఒక టీనేజ్ అబ్బాయి, వాళ్ల అబ్బాయి మధ్య జరుగుతుంది. కథలో ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఎస్కేఎన్,మారుతి గారికి చాలా థ్యాంక్స్ చెబుతున్నాం. క్వాలిటీ కంటెంట్ ను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడమే పెద్ద పని అయ్యింది. అలాంటి టైమ్ లో ఎస్కేఎన్, మారుతి గారు ముందుకొచ్చారు. నేను 15 ఏళ్లుగా నటిస్తున్నాను. 60 నుంచి 70 మూవీస్ చేశాను. ఘటికాచలం సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ - మారుతి గారు రాజా సాబ్ సినిమా షూటింంగ్ లో బిజీగా ఉండి రాలేకపోయారు. చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలే కీలకం. థియేటర్స్ ఫీడింగ్ అయ్యేదే చిన్న చిత్రాలతో. చిన్న చిత్రాలు ప్రమోషన్ లేక, ప్రాపర్ రిలీజ్ లేక ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. అలాంటి చిన్న చిత్రాలకు సపోర్ట్ చేయాలని మారుతి గారు, నేను, ధీరజ్ ఇలా మేమంతా అనుకున్నాం. ఈ క్రమంలో ఘటికాచలం సినిమా చూశాం. సినిమా చూస్తున్నంతసేపూ ఎంత బడ్జెట్ పెట్టి చేశారు అనేదాని కంటే టెక్నికల్ గా ఉన్న క్వాలిటీ బాగా ఆకట్టుకుంది. 


డైరెక్టర్ అమర్  గారు ఒక పది సినిమాలు చేసినంత ఎక్సీపిరియన్స్ ఉన్న డైరెక్టర్ లా మూవీ రూపొందించారు. నాకు హారర్ మూవీస్ చాలా ఇష్టం. భయపడినా ఇష్టపడుతూ హరర్ మూవీస్ చూస్తుంటా. మ్యూజిక్ డైరెక్టర్ సూపర్బ్ గా మ్యూజిక్ ఇచ్చారు. హారర్ మూవీ ఇవ్వాల్సిన ప్రతి అనుభూతిని ఘటికాచలం సినిమా ఇస్తుంది.  నిఖిల్ నటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అతనికి నేనిచ్చే సలహా ఏంటంటే ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయమని, హీరోగా వస్తే హీరోగా, క్యారెక్టర్ వస్తే క్యారెక్టర్ లో నటించు. ఘటికాచలం సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం. మా బేబీ సినిమా హందీ వెర్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇతర ప్రాజెక్ట్స్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి. అన్నారు.





More Press News