నాపై వచ్చిన ట్రోల్స్‌ పాజిటివ్‌గా తీసుకుంటాను: హీరో చంద్రహాస్‌

బుల్లితెరపై పాపులర్‌ నటుడు ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "రామ్ నగర్ బన్నీ". విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన "రామ్ నగర్ బన్నీ" విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చంద్రహాస్‌ సినిమా విశేషాలను పంచుకున్నారు 

ఆయన మాట్లాడుతూ ''రామ్ నగర్ బన్నీ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా నా డెబ్యూ మూవీ కావడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఎంట్రీ మరొకరికి దొరుకుందని అనుకోను. "రామ్ నగర్ బన్నీ" సినిమాలో నేను సూపర్ హీరోలా కనిపించను. ఒక సాధారణ యువకుడిగానే కనిపిస్తా. నేను తిట్లు తింటాను, అవమానాలు ఎదుర్కొంటాను. రకరకాల జాబ్స్ చేస్తాను. కొన్నిసార్లు జాబ్ లెస్ గా ఉంటాను. అన్నిరకాల ఎమోషన్స్ చేసే అవకాశం ఈ చిత్రంలో కలిగింది. ఈ సినిమా తర్వాత నేను అన్ని ఎమోషన్స్, అన్ని జానర్స్ చేయగలను అనే పేరొస్తుంది. ఆటిట్యూడ్ స్టార్ అనేది నేను పెట్టుకున్నది కాదు. "రామ్ నగర్ బన్నీ"  సినిమా చూశాక నేను ఆ ట్యాగ్ కు అర్హుడిని కాదు అంటే తీసేస్తా. 

నన్ను ట్రోల్ చేసే వారి గురించి ఇప్పటికే నా అభిప్రాయం చెప్పాను. ట్రోల్స్ వల్ల నేను పెద్దగా బాధపడలేదు. వాటిని పాజిటివ్ గా తీసుకున్నా. నేను సినిమాలు చేసేది నన్ను ఇష్టపడే ప్రేక్షకుల కోసం. వారికి నా నటన నచ్చితే చాలు అనుకుంటున్నా. నాకు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలని ఉంది. మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి. అవకాశం వస్తే అన్ని జానర్ మూవీస్ లో నటిస్తా. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నా. వాటి వివరాలు త్వరలో వెల్లడిస్తా అన్నారు. 

More Press News