మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బ్రహ్మానందంకు ఐఫా అవార్డ్
వందలాది చిత్రాల్లో నటించి, తన హాస్యం ద్వారా కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించిన టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంకు 'ఐఫా' పురస్కారం లభించింది.
అయితే, ఆయనకు ఈ అవార్డు లభించింది కమెడియన్ పాత్రకు కాదు... కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'రంగమార్తాండ' చిత్రంలో అద్భుతమైన రీతిలో భావోద్వేగాలు పండించిన 'చక్రపాణి' పాత్రకు గాను బ్రహ్మానందం 'ఐఫా' అవార్డుకు ఎంపికయ్యారు. కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందం... రంగమార్తాండలో ప్రేక్షకులతో కన్నీరు పెట్టించారు.
కాగా, అబుదాబిలో ఏర్పాటు చేసిన 'ఐఫా' అవార్డుల కార్యక్రమంలో... బ్రహ్మానందం ఈ విశిష్ట పురస్కారాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు. బ్రహ్మానందాన్ని చిరంజీవి మనస్ఫూర్తిగా అభినందించారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ... ఈ అవార్డ్ రావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కృష్ణవంశీకి చెందుతుందని, రంగమార్తాండ చిత్ర యూనిట్ సభ్యులు అందరికి అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. ఒక మంచి సినిమాలో మంచి పాత్రతో ఆడియన్స్ ను రంజింపజేసే అవకాశం రావడం మర్చిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రాజ్యశ్యామల ఎంటర్టయిన్ మెంట్స్, హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్లపై గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రంగమార్తాండ. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పోటీపడి నటించారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ఇలా సినిమాకు ప్రతీది ఒక హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా చక్రపాణిగా బ్రహ్మానందం, రాఘవరావు పాత్రలో ప్రకాశ్ రాజ్ హాస్పిటల్ ఎపిసోడ్ సీన్లు సినిమా చూసిన పతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి.