ZEE5లో సెప్టెంబ‌ర్ 27న స్ట్రీమింగ్ కానున్న బ్లాక్ బ‌స్ట‌ర్ హార‌ర్ మూవీ ‘డీమాంటే కాలనీ 2’

ZEE5 ప్రేక్ష‌కులారా! నిద్ర లేని రాత్రి కోసం సిద్ధంగా ఉన్నారా!.. ఇండియాలో వైవిధ్య‌మైన సినిమాలు, సిరీస్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ టాప్ పోజిష‌న్‌లో దూసుకెళ్తోన్న సంస్థ ZEE5. ర‌ఘుతాత‌, నున‌క్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భ‌యంతో థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించిన ‘డీమాంటే కాలనీ 2’తో మెప్పించ‌టానికి సిద్ధ‌మైంది. వెన్నులో వ‌ణుకు పుట్టించేలా తెర‌కెక్కిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27 నుంచి  ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అరుల్‌నిధి, ప్రియా  భ‌వానీ శంక‌ర్ అద్భుత‌మైన న‌ట‌న‌తో సీట్ ఎడ్జ్‌లో ప్రేక్ష‌కుల‌ను కూర్చోపెట్టారు. త‌మిళ్ సినీ హిస్ట‌రీలో ఫ్రాంచైజీగా రూపొందిన ‘డీమాంటే కాలనీ2’ రూ.55 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. ప్రేక్ష‌కుల‌ను భ‌యానికి గురి చేసిన లార్డ్ డీమాంట్, సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు మ‌రోసారి వ‌స్తున్నారు. 

‘డీమాంటే కాలనీ 2’ చిత్రం ప్రేక్ష‌కుల‌ను వెన్నులో వ‌ణుకు పుట్టించే అనుభ‌వానికి గురి చేసింది. శాప‌భ‌రిత‌మైన ఓ బంగారు గొలుసును దొంగ‌లించ‌టానికి కొంత‌మంది స్నేహితులు ప్ర‌య‌త్నిస్తారు. దాంతో నిద్రావ‌స్థ‌లోని భ‌యంక‌ర‌మైన ఆత్మ మేల్కొంటుంది. ఆ దుష్ట ఆత్మ ప్ర‌తీకార చ‌ర్య నుంచి త‌మ స్నేహితుల‌ను కాపాడుకోవ‌టానికి కొంత‌మంది ధైర్య‌వంతులైన స్నేహితులు ఏకం అవుతారు. ఘ‌న విజ‌యం సాధించిన‌ ‘డీమాంటే కాలనీ’కి కొన‌సాగింపుగా రూపొందిన ‘డీమాంటే కాలనీ 2’.. ముందు చిత్రాన్ని మించేలా ఆస‌క్తిక‌ర‌మైన హార‌ర్‌, థ్రిల్లింగ్ అంశాల‌తో తెర‌కెక్కింది. అంతే కాకుండా తొలి భాగం కంటే కూడా భ‌యానక‌మైన స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల‌కు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ‘డీమాంటే కాలనీ 2’ తెర‌కెక్కింది. 


ZEE5 చీఫ్ బిజినెస్ ఆఫీస‌ర్ మ‌నీష్ క‌ల్రా మాట్లాడుతూ ‘‘సౌత్ ఇండియ‌న్ కంటెంట్‌కు ZEE5లో మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ఈ క్ర‌మంలో ‘డీమాంటే కాలనీ 2’ వంటి హార‌ర్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాం. తొలి భాగాన్ని మించిన వైవిధ్య‌మైన అంశాల‌తో, హార‌ర్ ఎలిమెంట్స్‌తో సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. సౌత్ కంటెంట్‌కు ఆద‌ర‌ణ పెరుగుతోన్న క్ర‌మంలో ZEE5 ప్రేక్ష‌కుల‌కు హార‌ర్ చిత్రం డీమాంటే కాల‌నీ2 చిత్రాన్ని అందించ‌టం ఆనందంగా ఉంది.. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను ఈ చిత్రం మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు. 

చిత్ర ద‌ర్శ‌కుడు ఆర్.అజ‌య్ జ్ఞాన‌ముత్తు మాట్లాడుతూ ‘‘థియేట‌ర్స్‌లో ఘ‌న విజ‌యం సాధించిన ‘డీమాంటే కాలనీ 2’.. ఇప్పుడు జీ 5 ద్వారా మ‌రింత మంది ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి రావ‌టం ఆనందాన్నిచ్చే విష‌యం. ప్రేక్ష‌కుల నుంచి వ‌చ్చిన ఈ అద్భుత‌మైన స్పంద‌న గొప్ప‌గా అనిపించింది. ఇప్పుడు జీ5 వంటి మాధ్య‌మం ద్వారా ఈ చిత్రం అల‌రించ‌నుంది. మ‌రింత ఎక్కువ మంది ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా రీచ్ అవుతుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నాం. ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని సినిమాను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు’’ అన్నారు. 

న‌టుడు అరుల్‌నిధి మాట్లాడుతూ ‘‘‘డీమాంటే కాలనీ 2’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌టం ఆనందాన్నిచ్చే విష‌యం. ఈ చిత్రంలో డ‌బుల్ రోల్ చేశాను. శ్రీని అనే క్యారెక్ట‌ర్‌కు పూర్తి భిన్నంగా ఉండే ర‌ఘు అనే పాత్ర‌లో న‌టించాను. నా పాత్ర‌, నా పెర్ఫామెన్స్ ప‌ట్ల ప్రేక్ష‌కుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. జీ 5 ద్వారా మ‌రింత మంది ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నాను’’ అన్నారు. 

* సెప్టెంబ‌ర్ 27న వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా  ‘డీమాంటే కాలనీ 2’ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయ‌టానికి ZEE5ను ట్యూన్ చేయండి


ZEE5 గురించి...

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

More Press News