ఖైరతాబాద్ మహాగణేశుని సాక్షిగా.. పురాణపండ శ్రీనివాస్ 'మంత్ర గణపతి'కి జేజేలు
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశ్ మహా సంరంభంలో ఈ ఏడాది చందాలు చెల్లించే, అతిథులుగా పాల్గొనే భక్తులకు రెండు అపురూప శోభాయమాన గ్రంథాలను అందించబోతున్నట్టు ఉత్సవకమిటీ చైర్మన్ , శాసన సభ్యుడు దానం నాగేందర్ , ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ తెలిపారు.
కిమ్స్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో మహా తేజోవంతమైన సుమారు వందపేజీల పవిత్ర సొగసుల శ్రీ గణపతి భగవానుడి పవిత్ర గ్రంథం కాగా , రెండోది టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆత్మీయబంధువు , వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో శోభాయమానంగా ఋషుల మంత్ర విద్యల మంత్రం గుచ్ఛమని నిర్వాహకులు తెలిపారు.
ఆధ్యాత్మిక రంగాన్ని ఒక యజ్ఞభావనల నిస్వార్ధపవిత్ర మహా ప్రపంచంగా ప్రతీక్షణాన్ని సమర్పించే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అద్భుత కార్యక్రమానికి ప్రధాన పవిత్ర సూత్రధారి కావడం గమనార్హం. శ్రీ వరసిద్ధి వినాయక చవితి సందర్భంగా మంత్రమయ జ్ఞాపికలుగా లభించే అరుదైన అక్షర సంపదలను సమర్పించడం అదృష్టమని దానం నాగేందర్ పేర్కొన్నారు.
మొదటి తేజో విలసిత గ్రంథం ' గణానాం త్వా ' అపురూప శోభల మంత్ర శబ్దాల కాంతిపుంజం కాగా, రెండోది పరమ ఋషులు పరిపరి విధాల పరితపించిన స్తోత్ర విద్యల ' శ్రీమాలిక '. గణేశ, ముద్గల పురాణాలలోని పవిత్ర స్తోత్రాలతోపాటు, వేదాన్తర్గతమైన శ్రీ మహాగణపత్యుపత్, ఆదిశంకరాచార్యుల శ్రీ గణేశ పంచరత్నం వంటి అనేక అరుదైన విశేషాంశాలతో పరమ శోభాయమానంగా అత్యంత ఆకర్షణీయంగా ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత విలువల ' గణానాం త్వా ' గాణపత్య పవిత్ర గ్రంథం జంటనగరాలలో ఇప్పటికే అనేక ఆలయాలకు చేరింది.
ప్రకృతీ చైతన్య పవిత్ర స్వరూపమే మహాగణపతి మంగళ స్వరూపంగా గజవదనుని శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథతోపాటు అనేక అందమైన విఘ్నేశ్వరుని సౌందర్య చిత్రాలతో , అక్కడక్కడా కర్పూర పలుకుల్లాంటి వ్యాఖ్యాన సౌందర్యాల్ని పురాణపండ కలం పొంగించడంతో ఈ ' గణానాం త్వా ' గ్రంథానికి అనేక చోట్ల జేజేలు పలుకుతున్నారు.
సుమారు డెబ్భైకి పైగా ఎన్నో ధార్మిక , ఆధ్యాత్మిక అపురూప గ్రంథాల్ని రచించి సంకలనం చేసి వేలకొలది అభిమానులను సంపాదించుకున్న శ్రీనివాస్ గత రెండున్నర దశాబ్దాలుగా ఏటా వినూత్న శోభలతో అందిస్తున్న వరసిద్ధి వినాయక చవితి పవిత్ర సంచికకు ఒక గుర్తింపు ఉంటోందని యాదాద్రి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ , సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ. కిషన్ రావు , తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు, సీనియర్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి స్పష్టం చేశారు.