361 మెషిన్లతో ఏడు వేలకు పైగా పారిశుద్ధ్య కార్మికులతో వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ: వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం  వరద ప్రభావిత ప్రాంతమైన  అజిత్ సింగ్ నగర్ లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు తమ తమ సమస్యలు కమిషనర్ గారికి వివరించగా, ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి అవ్వదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి నెతృత్వంలో, రాష్ట్ర పురపాలక సంస్థల సహకారంతో  విజయవాడ నగరపాలక సంస్థ అహర్నిశలు పనిచేస్తుందని, ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ప్రభుత్వం నిత్యం చర్యలు తీసుకుంటుందని  అన్నారు.

విజయవాడ నగర పరిధిలో ఉన్న 64 వార్డులలో 32 వార్డులలో వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని, 149 వరద ప్రభావిత సచివాలయాల్లో, ఇప్పటివరకు 135 సచివాలయాలలో పారిశుద్ధ్య  నిర్వహణ శర్వేగంగా జరుగుతుందని, మిగిలి ఉన్న 14 సచివాలయాల్లో వరద నీరు ఇంకా తగ్గు ముఖం చూపకపోవడంతో పారిశుద్ధ్య  నిర్వహణ చేయలేకపోతున్నారని అయినప్పటికీ డ్రోన్ల సహాయంతో  హైపోక్లోరైడ్, ఎమ్ ఎల్ ఆయిల్స్ స్ప్రే చేసి ప్రజలు అనారోగ్య బారిన పడకుండా చూసుకుంటున్నారని అన్నారు.

 135 సచివాలయాల్లోని 31 సచివాలయాల పరిధిలో 100% పారిశుద్ధ్య నిర్వహణ జరిగిందని, అందుకు అవసరమగు 361 మెషిన్లతో పారిశుద్ధ్య నిర్వహణ చేస్తూ నిత్యం 110  ఫైర్ పంపుల సహకారంతో వరద ప్రభావితమైన ప్రాంతాల ప్రజల ఇల్లు, షాపులు శుభ్రపరుస్తున్నారని  ఇప్పటివరకు దాదాపు 12500 ఇళ్లను శుభ్రపరిచారని, నీళ్లు నిండిపోయి ఉన్న ప్రదేశాలలో ఫై డిపార్ట్మెంట్ వారి 12, ఇంజనీరింగ్ మరియు  పబ్లిక్ హెల్త్ వారి 166 పంపుసెట్లు ద్వారా వరద నీటిని బయటకు తీస్తున్నారని కమిషనర్ ధ్యానచంద్ర  అన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న 458 కిలోమీటర్ల  రోడ్లలో 292 కిలోమీటర్ల రోడ్ల పారిశుధ్య నిర్వహణ జరిగిందని . దాదాపు 1500 మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు తొలగించారని,  ప్రజలు అనారోగ్య పాడిన పడకుండా ఉండేందుకు 56  మెట్రిక్ టన్నుల బ్లీచింగ్ పౌడర్ లను వరద ప్రభావిత ప్రాంతాలలో నిత్యం వేస్తూ పారిశుధ్య నిర్వహణ పక్కగా పగడ్బందీగా జరుగుతుందని కమిషనర్ అన్నారు.

534 కిలోమీటర్ల డ్రైన్ లలో 277 కిలోమీటర్ల డ్రైన్ల పూడికలు తీసివేశారని నిత్యం ఫాగింగ్ చేస్తూ ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేస్తూ దోమల ఉత్పత్తికి కారణం కాకుండా ఎక్కడికక్కడ దోమలను నియంత్రించే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ నిత్యం శ్రమిస్తుందని అన్నారు.

 గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అధునాతన టెక్నాలజీ  ఉపయోగించి డ్రోన్ల సహాయంతో ఎమ్మెల్యే చేస్తూ హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తూ ప్రజలు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా లాంటి విష జ్వరాల్లో పారిన పడకుండా ఉండేందుకు విజయవాడ నగరపాలక మరియు ఇతర పురపాలక సంస్థల నుండి వచ్చిన 7000కు పైగా   పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో వరద ప్రభావిత ప్రాంతాలలో  విజయవాడ నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటున్నారని  కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రభావిత ప్రాంతాలైన 32 వార్డులకు 32 మున్సిపల్ కమిషనర్లతో, ప్రత్యేక పర్యవేక్షణలో నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజల సమస్యలు, నిరంతరం పర్యవేక్షిస్తూ  ప్రజల సమస్యలను తీర్చే దిశగా విజయవాడ నగరపాలక సంస్థ  పనిచేస్తుందని అన్నారు.
 పౌర సంబంధాల అధికారి
 విజయవాడ నగరపాలక సంస్థ
VMC

More Press News