స్టేజ్ మీద సింబా దర్శకుడు భావోద్వేగం

మొక్కలు నాటండి.. టికెట్లు ఫ్రీగా పొందండి అంటూ సింబా నటుడు శ్రీనాథ్, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్నారు. శనివారం నాడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పైవిధంగా మాట్లాడారు. ఇక ఈ సింబా సినిమా అనేది ప్రకృతి గురించి.. వృక్షాల గురించి అని ట్రైలర్, టీజర్ చూస్తేనే తెలుస్తుంది. సింబా సినిమా కోసం సంపత్ నంది అద్భుతమైన కథను అందించాడు. కథను మాత్రమే కాకుండా.. నిర్మాణంలోనూ భాగమయ్యాడు. రాజేందర్, సంపత్ నంది సంయుక్తంగా నిర్మించారు.

సింబా కథకు తన విజన్‌ను తోడు చేసి అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు మురళీ మనోహర్. ఇక ఈయన లండన్ ఫిల్మ్ స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకుని.. అక్కడే ఇండీ ప్రాజెక్టులకు పని చేశాడు. ఇండియాకు వచ్చి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశాడు. సంపత్ నంది వద్ద ఏమైంది ఈ వేళ రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నందా వంటి చిత్రాలకు పని చేశాడు. గాలిపటం సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా, పేపర్ బాయ్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశాడు. ఇక ఇప్పుడు సింబాతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు.

స్టేజ్ మీద దర్శకుడు మురళీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తన సినీ ప్రయాణంలో తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులు తలుచుకుని కంటతడిపెట్టేశాడు. ఇక దర్శకుడు ఈ కథను ఎంతగా ప్రేమించాడు.. ఈ ప్రయాణంలో అందరూ ఎంత సహకరించారో ఆయన స్పీచ్ వింటేనే అర్థమైంది. సింబా కథ అందరికీ కనెక్ట్ అవుతుందని, అందరికీ ఓ మంచి సందేశం ఇచ్చేలా ఉంటుందని అన్నాడు.

More Press News