టీ-హబ్ ను సందర్శించిన యునైటెడ్ కింగ్ డమ్ జర్నలిస్టుల బృందం!

హైదరాబాద్ లో మూడు రోజుల పర్యటనకుగాను విచ్చేసిన యునైటెడ్ కింగ్ డమ్ (U.K.) జర్నలిస్టులు, ఎడిటర్ల బృందం గురువారం T-HUBను సందర్శించింది. భారత ప్రభుత్వ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత పర్యటనకు గాను ఈ బృందం ఈ నెల 2 వ తేదీ న న్యూఢిల్లీ కి చేరుకుంది. అందులో భాగంగా నగర పర్యటనకు వచ్చిన ఈ బృందం గురువారం T-HUB కు చెందిన స్టార్టప్స్ , ఇతర ఐ.టి. ఏర్పాట్లను పరిశీలించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పాటైన T-HUB ప్రాముఖ్యత గురించి టి హబ్ ప్రతినిధి గణేశ్ బృందానికి వివరించారు. T-HUB ఏర్పాటు చేసిన విధానం, అందిస్తున్న సేవల గురించి జర్నలిస్టులు, ఎడిటర్లు ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఈ బృందం చారిత్రక ప్రాముఖ్యత ఉన్న గోల్కొండ కోటను సందర్శించింది. గోల్కొండ చారిత్రక విశేషాలను, కట్టడం నిర్మాణాల గురించి సంబంధిత అధికారులు బృందానికి వివరించారు.

సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ ఆదేశాల మేరకు శాఖాధికారులు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ బృందం వెంట మీడియా అకాడమీ సెక్రటరీ విజయ్ గోపాల్ , సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటి డైరెక్టర్ డి.శ్రీనివాస్, భారత ప్రభుత్వ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు దేవేందర్ కుమార్, సుధాంశ్ కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ ఆధికారి ఉమేశ్ బాజ్ పేయి ఉన్నారు.

ఈ బృందం బుధవారం నగరానికి చేరుకొని, అనంతరం రామోజి ఫిలిం సిటీని సందర్శించింది. శుక్రవారం ఈ బృందం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB), TCS, ఏరోస్పేస్ పార్కును సందర్శించనుంది. అనంతరం ఈ బృందం తిరిగి న్యూఢిల్లీ కి వెళుతుంది.


More Press News