సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు
విజయవాడ నగరపాలక సంస్థ
18-07-2024
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు
హెల్ సెక్రటరీలు కచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించాలి
ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ఆదేశాలు
హెల్త్ సెక్రటరీలు ప్రతిరోజు ప్రజలకు సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కచ్చితంగా నిర్వహించాలని అధికారులకు అదేశాలు ఇచ్చారు.
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా శ్రీనివాస నగర్, 16, 17, 18 వ డివిజన్లు, రాణి గారి తోట, 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంతాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా శ్రీనివాస నగర్ కాలనీలో పర్యటించి అక్కడ కింద పడిన చెట్టు కొమ్మలను చూసి వెంటనే ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అది తీసివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 16 వ డివిజన్ కాలానగర్ ,17, 18 వ డివిజన్ రామాలయం స్ట్రీట్, లక్కీ బార్ రోడ్, రాణి గారి తోట పర్యటించి అక్కడ రోడ్ల పైన నిలిచి ఉన్న వర్షపు నీటి నిలువలను వెంటనే పరిశుభ్రపరచాలని వర్షపు నీరు సైడు కాలువలో ప్రవహించేటట్టు చూసుకోవాలని డ్రైన్లు లేనిచోట కచ్చా డ్రైనే వెంటనే తీయించి రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీటిని సైడ్ డ్రైన్ లోకి వెళ్లేటట్టు చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
రోడ్లపై ఉన్న ఆవులను చూసి వెంటనే వీఏఎస్ గారిని క్యటిల్ డ్రైవ్ నిర్వహించి ఆవులను షెడ్డులోకి తరలించి, ఆవులను రోడ్ల పైన వదిలేసిన యజమానులకు జరిమానా విధించాలని ఆదేశాలు ఇచ్చారు. తదుపరి 51వ డివిజన్ గొల్లపాలెం గట్టు ప్రాంత పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
పౌర సంబంధాల అధికారి
విజయవాడ నగర పాలక సంస్థ