‘మరింత పట్టుదలగా’ ఉండాలనే నీరజ్ చోప్రా మాటలు అండర్ ఆర్మర్ బ్రాండ్ ప్రచారానికి స్ఫూర్తి
సంసిద్ధత కంటే మించినది సంకల్పం – నీరజ్ చోప్రా
ఇండియా, జూలై 16 2024:నీరజ్ చోప్రా నమ్మే ధైర్యం, పోరాటపటిమ, దృఢసంకల్పం, మొండి పట్టుదల అండర్ ఆర్మర్ ప్రచారానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. దేశానికి మరింత కీర్తి తీసుకువచ్చేందుకు లక్ష్యసాధనలో వెనక్కి తగ్గరాదనే ఈ ఒలింపిక్ విజేత, ప్రపంచ ఛాంపియన్ పట్టుదలతో కూడిన మనస్తత్వాన్ని ‘మరింత పట్టుదలగా’ అనే ఈ ప్రచారం లోతుగా తెలియజెప్తుంది.
విస్మయపరిచే ఈ ప్రచారం కోసం గంటలకొద్ది చోప్రా కఠినమైన శిక్షణ తరగతులను రోజుల కొద్ది షూట్ చేస్తూ రూపొందించడం జరిగింది. ‘సంసిద్ధత కంటే మించినది సంకల్పం’ అని మాటలతో ఈ చిత్రం ఒపెన్ అవుతుంది. ఈ మాటలను చోప్రా వ్యక్తిగతంగా నమ్మడమే కాదు తన కఠోర శిక్షణలో ఎదురయ్యే అలసట, గాయాలు, విదేశాల్లో ఒంటరితనంతో చేసే పోరాటంలో వ్యక్తం చేస్తూ ఉంటారు.
“మా బ్రాండ్ ముఖ్య విలువలైన ధైర్యం, పోరాటపటిమ, దృఢనిశ్చయానికి నిలువెత్తు రూపంగా, నేటి తరానికి ఐకాన్‌గా నిలుస్తున్న భారతదేశపు గొప్ప అథ్లెట్స్‌లో ఒకరైన నీరజ్‌తో దీర్ఘకాలిక అనుబంధం కొనసాగిస్తుండటం మాకు చాలా గర్వంగా ఉంది. ఈ ప్రచారం ద్వారా అథ్లెట్స్‌లో అందరిలో స్ఫూర్తి నింపుతూ భారతదేశపు అత్యంత ఇష్టపడే అథ్లెటిక్ పర్ఫామెన్స్ బ్రాండ్‌గా నిలిచేందుకు మేము ప్రయత్నిస్తున్నాం” అన్నారు అండర్‌డాగ్ అథ్లెటిక్స్ మేనేజింగ్ డైరెక్టర్, భారతదేశపు ప్రత్యేక డిస్ట్రిబ్యూటర్, అండర్ ఆర్మర్ లైసెన్సీ తుషార్ గోకుల్‌దాస్.
“నా శిక్షణ, పోటీల సమయంలో నా ఆటతీరు మెరుగుపరిచే అధిక-పనితీరు అందించే సాధనాలే కాకుండా, భవిష్యత్ తరం భారతీయ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చేలా నా ప్రయాణాన్ని తెలియజెప్పడంలో అండర్ ఆర్మర్ నాకు అండగా నిలవడం చాలా గొప్ప విషయం. ఏకాగ్రతతో ఉండండి, కష్టపడి పనిచేయండి, మీ కలలు సాకారం చేసేందుకు కృషి చేయండని నేను బలంగా నమ్మే సందేశాన్ని ఈ ప్రచారం ప్రతిధ్వనింపజేస్తుంది కాబట్టి దీంతో నాకు చక్కని అనుబంధం ఉంది” అన్నారు నీరజ్ చోప్రా.
పురుషుల జావెలిన్ త్రో ఆటలో ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఒలింపిక్ గోల్డ్ గెలిచిన ఆసియాకు చెందిన మొదటి ఆటగాడు నీరజ్. వ్యక్తిగతంగా ఒలింపిక్ స్వర్ణం సాధించిన ఇద్దరు భారతీయుల్లో ఒకరు. ఈ 26 ఏళ్ల ఆటగాడు ప్రపంచ అథ్లెట్స్‌లో అత్యంత స్థిరత్వం చూపుతున్న వారిలో ఒకరు. 2018 నుంచి ఇప్పటి వరకు 26 పోటీల్లో పొడియం ఫినిష్ సాధించారు.
"భారతదేశంలో అండర్ ఆర్మర్ తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ మరింత పట్టుదలగా ప్రచారం ద్వారా ప్రముఖ అథ్లెట్ నీరజ్‌చోప్రాను తీసుకువస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే తరపు భారతీయ క్రీడాకారులకు నీరజ్ చోప్రా చక్కని ప్రేరణ నిలవడమే కాదు భారతదేశంలో అథ్లెటిక్స్ వృద్ధి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. ఆయన విజయం భారతదేశంలో ఒలింపిక్ క్రీడల మార్కెటింగ్ శక్తిని వెలికితీసింది. అండర్ ఆర్మర్ చేపడుతున్న ఈ తరహా ప్రచారం JSW స్పోర్ట్స్‌లో భారతీయ క్రీడా నైపుణ్యం పెంచుకోవడంతో పాటు స్పాన్సర్‌షిప్స్‌లోనూ కీలక పాత్ర పోషిస్తోంది' అన్నారు JSW స్పోర్ట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ దివ్యాన్షు సింగ్. JSW స్పోర్ట్స్ 2017 నుంచి నీరజ్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తోంది.
ఆర్మర్ చేపడుతున్న మరింత పట్టుదలగా ప్రచారం చోప్రా ప్రయాణాన్ని తెలియజెప్పడమే కాదు #ZIDDFORMORE హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించి దేశంలోని వారంతా పట్టుదలకు సంబంధించిన తమ సొంత అనుభవాలను పంచుకునేలా ప్రోత్సహిస్తుంది. సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచే ఈ సమిష్ఠి కార్యక్రమం సమాజంలో స్ఫూర్తిని నింపడం, వ్యక్తులు స్వీయ పరిమితులు దాటుకొని అత్యుత్తమ ప్రతిభ సాధించేందుకు ప్రేరణగా నిలుస్తుంది.