ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన 19 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన 19 ఫిర్యాదులు

స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకి పరిష్కారం ఖచ్చితం గా  ఇవ్వండి

ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ అధికారులు ఆదేశాలు


 ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ 19 ఫిర్యాదులు అందుకున్నారు.

 ప్రజలు తమ సమస్యలు అధికారుల ముందుకు తెలియపరచగా  ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, అధికారులకు శాశ్వత పరిష్కారాన్ని అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అన్నారు. మూడు సర్కిల్లో జోనల్ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్లో ఉండగా ప్రజలు తమ తమ ఫిర్యాదులను ఇంచార్జ్  కమిషనర్ గారికి తెలియపరచగా ఏ సర్కిల్ పరిధిలో ఉన్న ఆ సర్కిల్ సమస్యలు కమిషనర్ తో మాట్లాడుతూ సమస్యను పరిష్కరించే దిశగా ఆదేశాలు ఇచ్చారు.

 ఈవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో రెండు ఫిర్యాదులు ఎస్టాబ్లిష్మెంట్ కి సంబంధించినవి, మూడు ఫిర్యాదులు ఇంజనీరింగ్, ఐదు ప్రజారోగ్యం, ఆరు పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ, యు సి డి మరియు జేడీ అమృత్ కి ఒక ఫిర్యాదు అందినవి.

 సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తో పాటు అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, చీఫ్ సిటీ ప్లానెట్ జి వి జి ఎస్ వి ప్రసాద్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వన్ డాక్టర్ సురేష్ బాబు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి ఎస్ ఎస్ సోమశేఖర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, అకౌంట్స్ ఆఫీసర్ నరసింహమూర్తి, తో సహా వీడియో కాన్ఫరెన్స్లో జోనర్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.

More Press News