కర్నూలులో కిమ్స్ కడల్స్ సేవలు
* మాతా శిశు సంరక్షణకు మరింత మెరుగైన సేవలు
* పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ సేవల అందుబాటు
* ప్రారంభించిన కిమ్స్ సిఎండి డాక్టర్ భాస్కరరావు
కర్నూలు, జూలై 13, 2024: ఇన్నాళ్లూ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలకు మాత్రమే పరిమితమైన కిమ్స్ కడల్స్ ఆస్పత్రి సేవలు ఇప్పుడు రాయలసీమలోని కర్నూలు నగరానికి కూడా తరలివచ్చాయి. కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా అభివృద్ధి చేసిన మాత శిశువు సూపర్ స్పెషాలిటీ సేవల విభాగం అయిన కిమ్స్ కడల్స్ ఆస్పత్రిని కిమ్స్ గ్రూప్ సిఎండి డాక్టర్ బొల్లినేని భాస్కరరావు శనివారం ఉదయం 8.00 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మాతా శిశు సంరక్షణలో ఇది సరికొత్త అధ్యాయం. రాయలసీమ ప్రాంతవాసులకు స్త్రీలు మరియు పిల్లల సంరక్షణ విషయంలో అత్యున్నత స్థాయి వైద్యసేవలు అందించడానికి కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కర్నూలుకు వచ్చింది. ఇక్కడ నియోనాటల్ ఐసీయూ, పీడియాట్రిక్ కార్డియాలజీ, పీడియాట్రిక్ న్యూరాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జరీలు కూడా వస్తాయి. ఇలాంటి అత్యాధునిక వైద్యసేవలు కావాలంటే ఇప్పటివరకు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక రాయలసీమ వాసులకు కర్నూలులోనే ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. అత్యాదునిక వైద్య పరికరాలు కూడా ఉండటం వల్ల అన్నిరకాల వైద్య పరీక్షలు ఇక్కడే చేయించుకోవచ్చు. ఎలాంటి సంక్లిష్టమైన ప్రసవాల కేసులైనా ఇక్కడి నిపుణులైన వైద్యులు చూస్తారు” అని చెప్పారు.
కర్నూలులోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో 30 మందికి పైగా సీనియర్ వైద్యులు, 200 మందికి పైగా సిబ్బంది రోజుకు 24 గంటలూ ఇక్కడి మాతా శిశు సంరక్షణ విభాగంలోని తల్లులు, పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఇప్పటికే ఇక్కడ నెలకు దాదాపు 60 నుంచి 70 వరకు ప్రసవాలు జరుగుతుండగా, ఇకపై తల్లులు, చంటిపిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సంక్లిష్టమైన సమస్యలకైన పరిష్కారం దొరుకుతుంది. ఎంఆర్ఐ, సీటీస్కాన్, ఫిజియోథెరపీ, చైల్డ్ డెవలప్‌మెంట్ యూనిట్ (సీడీయూ) లాంటి అత్యాధునిక పరికరాలు, సేవలు ఉంటాయి. అత్యంత క్లిష్టమైన ప్రసవాలు కూడా ఇక్కడ చేస్తారు. కవలలు, ముగ్గురు పిల్లలు ఉన్న కేసులు, తరచు గర్భవిచ్ఛిత్తి అవుతున్న కేసులు, మధుమేహం లేదా కాలేయ సమస్యలు ఉన్న మహిళలకు ప్రసవాలు, ఫైబ్రాయిడ్ల వల్ల ఇబ్బంది అవుతున్నా, రక్తహీనత ఉన్నా, ఒవేరియన్ సిస్టులు ఉన్నా, కిడ్నీ వ్యాధులు ఉన్నా ఐవీఎఫ్ కేసులు, కిడ్నీ మార్పిడి చేయించుకున్న మహిళలకు క్లిష్టమైన ప్రసవాల లాంటివి ఇక్కడ చేస్తారు. అలాగే చంటిపిల్లలకు సంబంధించి నెలలు నిండకముందే పుట్టే పిల్లల సంరక్షణ, గర్భస్థ శిశువులలో లోపాలు, పిల్లలకు సంబంధించి యూరాలజీ శస్త్రచికిత్సలు, అన్నిరకాల లోపాలకు సంబంధించిన చికిత్సలు లభిస్తాయి. ఈ కార్యక్రమంలో సిఓఓ డా. సునీల్, వైద్యనిపుణులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ రఫీక్ అహ్మద్, డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, డాక్టర్ వెంకట శెట్టి, డాక్టర్. లక్ష్మి ప్రసన్న, డాక్టర్. శిల్ప, డాక్టర్. కుసుమ, డాక్టర్. శ్రీకాంత్, డాక్టర్ శ్వేతా రాంపల్లి, డాక్టర్ మహ్మద్ ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు.