మూడు చక్రాల వాహనాల కోసం నూతన డీలర్ షిప్ ప్రారంభించిన బజాజ్ ఆటో
‘టెక్నాలజీ నయీ, భరోసా వహీ!’ అని హామీ ఇస్తూ తమ నూతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ల శ్రేణి ప్రదర్శన
బజాజ్ RE E-Tec 9.0, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్, 8.9 kWh బ్యాటరీతో 178 కి.మీ (ARAI ధృవీకరణ ప్రకారం) పరిధిని అందిస్తుంది . దీని ధర రూ. 3, 65, 419/-(ఎక్స్-షోరూమ్ హైదరాబాద్, ఫేమ్ II ప్రోత్సాహకం తరువాత )
హైదరాబాద్, 27 జూన్ 2024: ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్విచక్రవాహన మరియు మూడు చక్రాల వాహన కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్, తమ నూతన కార్గో మరియు ప్యాసింజర్ త్రీ వీలర్ ఆటోల కోసం ఈరోజు హైదరాబాద్‌లో తమ సరికొత్త డీలర్ షిప్ ను ఉప్పల్ భాగాయత్ వద్ద శ్రీ వినాయక బజాజ్ పేరిట ప్రారంభించింది. ఈ డీలర్ షిప్ ను శ్రీ అన్షుల్ చోప్రా ( విపి సేల్స్ , ఐబియు) ప్రారంభించగా , వర్క్ షాప్ ను శ్రీ అనుపమ్ శ్రీవాస్తవ (విపి - సర్వీస్ , ఐబియు) ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో శ్రీ వినాయక ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, చైర్మన్ శ్రీ కె వి బాబుల్ రెడ్డి సహా పలువురు ముఖ్య అతిధులు పాల్గొన్నారు.
ఈ డీలర్ షిప్ వద్ద బజాజ్ ఆటోల సమగ్ర శ్రేణి అందుబాటులో ఉంటుంది. ఈ నూతన డీలర్ షిప్ ప్రారంభం పురస్కరించుకుని ప్రయాణీకుల ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ బజాజ్ RE E-Tec 9.0ను ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఈ సందర్భంగా అన్షుల్ చొప్రా మరియు అనుపమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ “కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ సహా ప్యాసింజర్, కార్గో ఫార్మాట్‌లలో ఇక్కడ త్రీ వీలర్ వాహనాలను అందించనున్నారు. వినియోగదారులకు మా సేవలను విస్తరించేందుకు తెలంగాణ వ్యాప్తంగా మా డిస్ట్రిబ్యూషన్ సేవలను విస్తరించనున్నాము " అని అన్నారు.
శ్రీ వినాయక ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ కె వి బాబుల్ రెడ్డి మాట్లాడుతూ బజాజ్ ఆటో డీలర్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు, మెరుగైన అమ్మకాలు మరియు అమ్మకం తరువాత సేవలను అందించనున్నాం" అని అన్నారు.