ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం

ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి నగర కమిషనర్ అధికారులకు ఆదేశాలు

 విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండర్ కంట్రోల్ రూమ్ నందు నగర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం ( ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక), నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వివిధ శాఖాధిపతుల  సమక్షంలో నిర్వహించారు.

 ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ మాట్లాడుతూ ప్రజలకు సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ఇదొక మంచి అవకాశం అని ప్రతి సోమవారం ప్రధాన కార్యాలయం మరియు జోనల్ కార్యాలయాల్లో తమ ఫిర్యాదులను తీసుకువచ్చి సత్వరమే పరిష్కరించుకోవాల్సిందిగా కమిషనర్ ప్రజలను కోరారు.

 ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 8 ఫిర్యాదులు అందగా. అందులో రెండు ఇంజనీరింగ్ విభాగం, ఒకటి ప్రజారోగ్యం, నాలుగు టౌన్ ప్లానింగ్, ఒకటి యు సి డి విభాగాలకు చెందిన ఫిర్యాదులు అధికారులు స్వీకరించారు.

 ఈ కార్యక్రమంలో కమిషనర్ స్వప్నిల్ తోపాటు అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ కేవీ సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఏం ప్రభాకర్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1- ఏ ఎస్ ఎన్ ప్రసాద్, జాయింట్ డైరెక్టర్ అమృత్ లతా, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ బి సోమశేఖర్ రెడ్డి, డెబిట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ రామ్మోహన్ రావు, ఎకౌంట్స్ ఆఫీసర్ నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు

More Press News