పటమట రెల్లి కాలనీలో పరిస్థితులను పరిశీలించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

పటమట రెల్లి కాలనీలో పరిస్థితులను పరిశీలించిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

మంచినీటి సరఫరాలో నాణ్యత, ఇతర సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ


 పురపాలక పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సోమవారం ఉదయం వంటకాలవ రోడ్ లోగల రెల్లిస్ కాలనీ లో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి  నారాయణ మాట్లాడుతూ  వర్షాకాలం ప్రారంభం కావడంతో డయేరియా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి  ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారని,  రెల్లి కాలనీలో ప్రజలను కలిసి సమస్యలను  అడిగి తెలుసుకున్నర్నాని, మంచినీటి సరఫరాలో ఉన్న నాణ్యతను పరిశీలించారాని, ఇప్పటి వరకు ఆరు వందల శాంపిల్స్ పరిశీలించారని ఎటువంటి ఇబ్బంది లేదని, మంచినీటిలో నాణ్యత నిబంధనల ప్రకారం  ఉన్నట్లు గుర్తించారని, విజయవాడ ప్రజలకు 187ఎం.యల్.డి నీటి సరఫరా అవుతుందని,

వర్షాలు వచ్చినప్పుడు ఓపెన్ డ్రెయిన్ల వద్ద నీరు పొంగడం వల్ల మంచినీటి పైపుల్లో కలిసే ప్రమాదం ఉంది కాబ్బటి, అధికారులకు టెలి కాన్పరెన్స్ పెట్టి.. సిల్ట్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకూ సూచించారని, వాటర్ ఆగకుండా ప్రవాహం ఉంటే.. నీరు కలిసే అవకాశం ఉండదనేది తన అభిప్రాయమని

డ్రింకింగ్ వాటర్ లైన్స్, ఓపెన్ డ్రైనేజీ పైపు లైన్స్ పక్కపక్కనే ఉన్నందు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వంద శాతం  పూర్తి అయితే ఇటువంటి ఇబ్బందులు ఉండవని, అయితే దీనికి ఆర్దికంగా నిధులు కేటాయించాల్సి రావడంతో  కొంత ఆలస్యం అవుతుందని, ఓపెన్ డ్రైన్స్, ట్యాప్ లు పక్కపక్కన లేకుండా ఆరు మున్సిపాలిటీల పరిధిలో పనులు చేపడుతున్నారని తెలిపారు.


 ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో డయేరియా ప్రబలుతుందని,  తూర్పు నియోజజక వర్గంలో  ఇటువంటి ప్రమాదం తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఏడో డివిజన్ లో మొదట్లో ఇబ్బంది ఎదురైనా.. తర్వాత పూర్తిగా సరి చేశారని, పేదలు నివసించే ప్రాంతాలలో అధికారులతో కలిసి పర్యటించి.. ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా పటమట రెల్లి కాలనీలో పరిస్థితిని పరిశీలించారని, మంచినీటి సరఫరాలో నాణ్యత, ఇతర సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారని, పేదలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు, వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.

 ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ నగరంలో vmc ప్రజల యోగక్షేమాల పట్ల పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని,  అందుకు ఒకవైపు రిజర్వాయర్ దగ్గర నుండి ఇళ్ల వరకు వెళ్లే ఫిల్టర్ ఐన నీటి సరఫరాను నిరంతరం పరీక్షలు నిర్వహించడమే కాకుండా ప్రజలకు సురక్షితమైన నీటిని సరఫరా చేయటంలో  ఇంజనీరింగ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి త్రాగునీటి పరీక్షలను చేస్తూ డ్రైన్ ల వద్ద ఎటువంటి పైప్ లీకేజీలున్న వెంటనే మరమ్మతులు చేసి, సురక్షితమైన త్రాగునీటిని ప్రజలకు నిత్యం అందిస్తున్నారని,


అలాగే ప్రజా ఆరోగ్య సిబ్బంది ఎప్పటికప్పుడు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే కాకుండా, ప్రజలకు హెల్త్ సెక్రటరీ ల తో డోర్ టు డోర్ క్యాంపెయిన్ల ద్వారా కాచిన నీటినే తాగాలని, వంట పాత్రలను వేడి నీటితో శుభ్రపరచాలని, నిల్వ ఉన్న పాడైపోయిన ఆహార పదార్ధములు తినరాదని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ఇంటిని తరచూ బ్లీచింగ్ ఫినాయిల్ మొదలగు వాటి వినియోగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఓవర్ హెడ్ ట్యాంకుల మూతలు లేకుండా ఉంచకూడదని, తరచూ ఓవర్ హెడ్ టాంక్ లను బ్లీచింగ్ తో శుభ్రపరచాలని, మరుగుదొడ్లు వినియోగించిన తర్వాత సబ్బుతో శుభ్రపరచుకోవాలని, చిన్నపిల్లలను మురుగునీటి నందు ఆడుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లాంటి అంశాలను ప్రజలను అవగాహన కల్పిస్తున్నారని అన్నారు.

     

         

More Press News